‘జగనన్న సురక్ష’ ప్రజలకు మేలు చేసే అద్భుత కార్యక్రమం

9 నెలలు గడప గడపకు మన ప్రభుత్వం విస్తృతంగా చేపట్టాలని సీఎం సూచించారు

ఎల్లో మీడియా దుష్ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని ఆదేశించారు

సీఎం సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తాడేపల్లి: ప్రజలకు మేలు జరిగే మంచి కార్యక్రమం ‘జగనన్న సురక్ష’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం గురించి సీఎం వైయస్‌ జగన్‌ క్షుణ్ణంగా వివరించారని చెప్పారు. నెలరోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి, అధికారులు, గృహ సారథులు, వలంటీర్లు, కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారన్నారు. జగనన్న సురక్ష అద్భుతమైన కార్యక్రమం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న సురక్ష, గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష అనంతరం క్యాంపు కార్యాలయ ఆవరణలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం సమీక్ష జరిపారు. వచ్చే 9 నెలలు చాలా కష్టపడాలని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175  స్థానాలు కచ్చితంగా గెలుపొందాలని సీఎం చెప్పారు. ఆ దిశగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి గడప గడపకు మన ప్రభుత్వం విస్తృతంగా చేపట్టాలి.. ఇది మంచి కార్యక్రమం అని సీఎం సూచించారు’’ అని మంత్రి కారుమూరి చెప్పారు. 

2014 నుంచి 2019 వరకు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఎన్ని సెక్టార్లు కుప్పకూలిపోయాయో.. ఏరకంగా జీడీపీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, డెవలప్‌మెంట్స్‌ ఎంత కుంటుపడ్డాయో అన్నింటినీ సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిగా వివరించారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రగతి ఏరకంగా జరిగింది, జీడీపీ రేట్, ఫైనాన్స్‌ గ్రోత్‌ గురించి వివరించారు. ఎల్లో మీడియా రకరకాల పచ్చి అభూత కల్పనలు సృష్టిస్తోంది. ఆ దుష్ప్రచారాలను ఆధారాలతో సహా తిప్పికొట్టాలి. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని, రాష్ట్రం సాధించిన గ్రోత్‌ను ప్రజలకు వివరించాలని సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు’’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. 

Back to Top