పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిచేసేది సీఎం వైయ‌స్ జ‌గ‌నే

పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరి నాగేశ్వరరావు

విజయవాడ: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారని, చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, చేసిన తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైయస్‌ జగనే పూర్తి చేస్తారన్నారు. తోకలేని కోతుల్లా టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్టుగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఎవరూ ఊరుకోరని మండిపడ్డారు. టీడీపీ నేత నిమ్మల రామానాయుడు.. పెద్ద డ్రామానాయుడు అన్నారు. చించినాడలో రామానాయుడు రూ.35 లక్షలకు మట్టిని అమ్ముకున్నాడన్నారు. దళితుల భూములు లాక్కుంటున్నారంటూ డ్రామాలు ఆడుతున్నాడని మంత్రి కారుమూరి మండిపడ్డారు. 

తాజా వీడియోలు

Back to Top