వ్యవసాయం దండగ అంటే.. మేం పండుగ చేస్తున్నాం

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
 

అమ‌రావ‌తి: గ‌తంలో చంద్ర‌బాబు వ్యవసాయం దండగ అంటే.. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పండుగ చేస్తున్నార‌ని  మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఏపీలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు . రైతులకు మిల్లర్లకు సంబంధం లేకుండా చేస్తున్నామన్నారు. గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు ధాన్యం అమ్ముకునే అవకాశం వుంటుందన్నారు. 21 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. టీడీపీ హయాంలో ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మేం ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top