సీఎం వైయస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
 

తూర్పుగోదావరి: ప్రతి పనిలో చిత్తశుద్ధి, పారదర్శకతతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నాలుగు నెలల పాలనలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దమ్మున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ప్రజా రంజక పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శప్రాయుడిగా సీఎం వైయస్‌ జగన్‌ మారారన్నారు. 2019 ఎన్నికల శంఖారావాన్ని కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచే వైయస్‌ జగన్‌ పూరించారు. దేశం మొత్తం తిరిగి చూసే విధంగా ఎన్నికల ఫలితాల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు సాధించి లీడర్‌ అంటే ఇతను అని దేశానికి చూపించారన్నారు. గతంలోని ప్రభుత్వాలు పథకాలు చాలా ప్రవేశపెట్టాయి. కానీ ఒక వ్యవస్థకు రూపొందించి దాన్ని అమలు చేయడానికి దమ్ముండాలి. అలాంటి దమ్మున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని అన్నారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగ నియామకాలు ద్వారా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు, నాలుగు నెలల్లో ఇచ్చారన్నారు.

బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ ఒక్క జాబు రాలేదు. వైయస్‌ జగన్‌ సీఎం అయిన తరువాత యువత అంతా జగనన్న వచ్చాడు. జాబు ఇచ్చాడని నినదిస్తుంది. ప్రజల ముందుకు నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని అనుసరించాల్సిందే. దశలవారీగా మద్య నిషేధం నిన్నే ప్రారంభమైంది. ప్రతి అడుగులోనే మార్కు కనిపిస్తుంది. ఇలాంటి సుపరిపాలనలో భాగస్వాములు అయినందుకు గర్వపడుతున్నానని మంత్రి కన్నబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం మాటలు కాదు చేతల్లో చూపించిన మీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ అన్నారు.

Back to Top