సోమిరెడ్డి.. జిల్లా అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదు 

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

సైదాపురంలో అక్రమ గనుల తవ్వకాలపై సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌మా?

నెల్లూరు:  టీడీపీ నేత సోమిరెడ్డి .. జిల్లా అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి హిత‌వు ప‌లికారు. సోమిరెడ్డికి మూడో జాబితాలో టీడీపీ టికెట్‌ రావడంపై మంత్రి వంగ్యాస్త్రాలు సంధించారు. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషం అన్నారు. వరుసగా నాలుగు సార్లు ఓడిపోయారు.. రెండు జాబితాల్లో చోటు దక్కలేదు.. సీనియర్ నేత అని చెప్పుకొనే సోమిరెడ్డికి.. టికెట్ రావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే నేను కూడా ఎన్నికల్లో ఎవరిపై మాట్లాడాలా అని అనుకున్నాను అన్నారు. కొత్తవాళ్లైతే విమర్శలు చేయడం కష్టం.. ఇక నా ఎన్నికల ప్రసంగాలు కూడా రంజుగా ఉంటాయి వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఇదే చివరి ఎన్నిక అని సోమిరెడ్డి చెబుతున్నారు.. అంటే ఓటు వేస్తే వేయండి.. లేకుంటే లేదని అంటున్నారు అని ఎద్దేవా చేశారు. అయితే, ఆయనను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి కాకాణి ప్ర‌క‌టించారు.

 రాజకీయంగా పరిణితి చెందిన సోమిరెడ్డి.. జిల్లా అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదు అని మంత్రి హితవుపలికారు.  సైదాపురంలో అక్రమ గనుల తవ్వకాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాన్నారు.. దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి అని సూచించారు. అక్రమ మైనింగ్ పై విచారణ జరపాలని నేను ప్రభుత్వానికి లేఖ రాశా.. సైదాపురంలో గనుల యజమానుల వద్ద సోమిరెడ్డి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. పొదలకూరులో రూ. 500 కోట్ల విలువైన తెల్లరాయిని తవ్వి స్టాక్ చేసారని సోమిరెడ్డి ఆరోపించారు. రూ.5 కోట్లు ఆయన చెల్లిస్తే.. ఆ స్టాక్ ఇచ్చేలా ప్రభుత్వం.. ఎన్నికల సంఘాన్ని కోరుతా.. దీనికి సోమిరెడ్డి సిద్ధమా? అని సవాల్‌ చేశారు. అక్రమ మైనింగ్ పై విచారణ కు రావాలి.. యాష్ పాండ్ లో కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆయన.. గతంలో ఆయన మద్దతుదారులు ఇసుకను అక్రమంగా రవాణా చేశారు.. కోర్టులో దొంగతనం పై సీబీఐ విచారణ నేను కోరాను, ఆ కేసులో సీబీఐ నా పాత్ర లేదని తేల్చింది.. దీనిని కూడా సోమిరెడ్డి సహించలేకపోతున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిప‌డ్డారు.

Back to Top