పాదయాత్ర పేరుతో లోకేష్‌ నైట్‌ వాక్‌

చంద్రబాబు కొడుకుగా తప్ప లోకేష్‌కు వేరే క్వాలిఫికేషన్‌ ఉందా..?

అసహ్యాన్ని మించి చంద్రబాబు, లోకేష్‌ ప్రవర్తన 

ఛాలెంజ్‌లు విసిరే స్థాయి లోకేష్‌కు ఉందా..? స్థాయి తెలుసుకొని మాట్లాడితే మంచిది

రెండు చోట్ల ఓడిపోయిన ఫ్రస్టేషన్‌లో పవన్‌ మాట్లాడుతున్నాడు

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

విజయవాడ: పాదయాత్ర పేరిట నైట్‌ వాక్‌ చేస్తున్న లోకేష్‌ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఫైరయ్యారు. రాష్ట్రంలో స్థిరమైన అడ్రస్‌ లేకుండా, కేరాఫ్‌ అడ్రస్‌తో బతికే లోకేష్‌ గురించి మాట్లాడుకోవడం కూడా అసహ్యంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫలానా మంచి చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేక.. కేవలం వైయస్‌ఆర్‌ సీపీ నేతలను దూషించడానికే లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నాడని మండిపడ్డారు. నెల్లూరులో ఏ సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేయలేని చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలకు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.  

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కొడుకుగా తప్ప లోకేష్‌కు వేరే క్వాలిఫికేషన్‌ ఉందా..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచి ప్రజాదరణ పొందలేదు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు.. అసహ్యాన్ని మించి చంద్రబాబు, లోకేష్‌ ప్రవర్తన ఉందన్నారు. తండ్రీకొడుకులు వాడే భాష వారి పక్కన నిల్చుకున్నవారికి అసహ్యంగా అనిపిస్తోందన్నారు.  

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంగం నెల్లూరు ప్రాజెక్టును కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడని, లోకేష్‌కు అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నాడన్నారు. ప్రతి ఒక్కరికీ ఛాలెంజ్‌లు విసురుతున్నానని మాట్లాడుతున్నాడు.. అసలు ఛాలెంజ్‌లు విసిరే స్థాయి లోకేష్‌కు ఉందా..? పనికిమాలిన లోకేష్‌ చేసే పాదయాత్ర అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని మంత్రి కాకాణి చెప్పారు. నైట్‌ వాక్‌ చేసి డెన్‌లోకి వెళ్లి పడుకొని, నిద్రలేచిన తరువాత హ్యాంగోవర్‌ దిగడానికి మధ్యాహ్నం వరకు రెస్ట్‌ తీసుకొని సాయంత్రం చల్లబడిన తరువాత రోడ్ల మీద నైట్‌ వాక్‌ చేస్తున్నాడని, ఒక్కోసారి సాయంత్రం వరకు దిగక రకరకాల మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్‌ ఇప్పటికైనా స్థాయి తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ వైయస్‌ జగన్‌ ప్రజల నుంచి వచ్చిన నాయకుడని, ప్రజల బాగు కోసం పనిచేస్తున్న ప్రజా నాయకుడు అని మంత్రి కాకాణి అన్నారు. 2019లో పవన్‌ కల్యాణ్‌ బట్టలు ప్రజలు రెండు చోట్ల ఊడదీశారని, ఆ ఫ్రస్టేషన్‌లోనే పవన్‌ మాట్లాడుతున్నాడన్నారు. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబు, లోకేష్, పవన్‌కు మళ్లీ ఏమీ లేకుండా ఊడదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.  
 

Back to Top