సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైయస్‌ జగన్‌

175 స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ జెండా ఎగురవేసి.. బీసీల సత్తా చాటుదాం

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి  రమేష్‌

విజయవాడ: సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైయస్‌ జగన్‌ – నయవంచకుడు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధానికి బలహీనవర్గాలమంతా సిద్ధంగా ఉందామ‌ని, 175 స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ జెండా ఎగురవేద్దామని, బీసీల సత్తా చాటుదామని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పిలుపునిచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న జయహో బీసీ మహాసభలో మంత్రి జోగి రమేష్‌ మాట్లాడారు. 

‘‘85 వేల మంది బలహీనవర్గాల ప్రజాప్రతినిధుల సైన్యాన్ని తయారు చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు పాదాభివందనం. విలువలు, విశ్వసనీయత గ‌ల నాయ‌కుడికి – వెన్నుపోటు, కుట్రదారుడికి మధ్య జరిగే యుద్ధానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైయస్‌ జగన్‌ – తన సామాజికవర్గ నిర్మాత చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. కుట్రలు, కుతంత్రాలతో 14 సంవత్సరాలపాటు బీసీలను బానిసలుగా చేసిన చంద్రబాబుకు, బీసీలను బలవంతులను చేసిన జగనన్నకు మధ్య జరిగే యుద్ధంలో సిద్ధంగా ఉండాలి. 

మనందరం కలిసి కట్టుగా ఉందాం. 139 కులాలు ఉంటాయని బీసీలుగా ఉన్న మనకే తెలియదు. ఈరోజు మనందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, నేను మీ ఆత్మబంధువుగా, మీ వెన్నంటే ఉంటాను.. మిమ్మల్ని బ్యాక్‌బోన్‌ క్లాసులుగా చేస్తానని చెప్పిన సీఎం వైయస్‌ జగన్‌కు బీసీలంతా రుణపడి ఉంటారు. టీడీపీకి చెందిన నేత అయ్యన్నపాత్రుడు 175 స్థానాలు వస్తాయని చెబుతున్నాడు. ఏం పీకారని టీడీపీకి 175 స్థానాలు వస్తాయి..? 2019 ఎన్నికల్లో టీడీపీని పీకిపాతరేశాం. 2024 ఎన్నికల్లో మా బలహీనవర్గాల దమ్ము ఏంటో చూపిస్తాం. 175 స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ జెండా ఎగురవేసేలా ప్రతీ ఒక్కరూ కంకణబద్ధులవుదాం. జగనన్న కోసం మనందరం సిద్ధంగా ఉండాలి. 

160 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని అచ్చెన్నాయుడిని ప్రశ్నిస్తున్నాను. బలహీనవర్గాలమంతా బలవంతులుగా మారాం. మూడున్నర సంవత్సరాల్లోనే బీసీలను బలవంతులను చేసిన జగనన్న వెంట నడవడానికి మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం. జగనన్న చెప్పినట్టుగా 175 స్థానాల్లో గెలిచి బలహీనవర్గాల సత్తా చాటుదాం. 
 

Back to Top