రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు, టీడీపీకి సమాధి కడతారు

మంత్రి జోగి రమేష్‌

రాజధానిలో పేదలు నివాసం ఉండకూడదా?

 ఇళ్ల పట్టాలపై చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారపూరితం

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు కడుపు మంట ఎందుకు?

చంద్రబాబు సంక ఎక్కడానికి పవన్‌ కళ్యాణ్‌ పరిమితం

ఒంటరిగా ఎదుర్కోలేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు

ఎంత మంది కలిసి వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ విజయం ఖాయం

తాడేపల్లి: పేద ప్రజలను చులకనభావంతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, టీడీపీకి రాష్ట్ర ప్రజలు సమాధి కడతారని మంత్రి జోగి రమేష్‌ హెచ్చరించారు. పేదల ఇంటి కలను సాకారం చేయడానికి సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఒక్క సెంట్‌స్థలమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పేదలంటే చంద్రబాబుకు చులకన భావమని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ విజయం ఖాయం చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

మంత్రి జోగి రమేష్‌ ఏమన్నారంటే..

  • రాష్ట్రంలో మహా యజ్ఞంలా ఇళ్ల పట్టాల పంపిణీ సాగుతోంది
  •  ఇళ్ల పట్టాలపై చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారపూరితం
  • పేదల ఇళ్లను సమాధులనడం దుర అహంకారం
  • ఓట్లు వేయడానికి మాత్రమే పేదలు పరిమితం కావాలా?
  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు కడుపు మంట ఎందుకు?
  • చంద్రబాబు పేదలకు ఒక్క సెంట్‌ భూమి అయినా ఇచ్చాడా?
  • పేదలు,పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం కరెక్ట్‌ అని సుప్రీంకోర్టు చెప్పింది.
  • చంద్రబాబు సంక ఎక్కడానికి పవన్‌ కళ్యాణ్‌ పరిమితం
  • ఒంటరిగా ఎదుర్కోలేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు
  • ఎంత మంది కలిసి వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ విజయం ఖాయం
  • రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు, టీడీపీకి సమాధి కడతారు
  • పేదలకు ఇళ్లు ఇస్తుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?
  • లోకేష్‌ పాకుతూ వస్తాడో..పొర్లు దండాలు పెట్టుకొని వస్తారో..ఎలాగైనా రండి అందరిని కలిపి కుమ్మేస్తాం
  • 2024లో రాష్ట్రంలో మళ్లీ వైయస్‌ఆర్‌సీపీ జెండా రెపరెపలాడబోతోంది. వైయస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
  • ఏ ఎన్నిక అయినా వైయస్‌ఆర్‌సీపీదే విజయం. చివరకు కుప్పంలో కూడా మా పార్టీ జెండా ఎగురవేస్తాం.
  • చంద్రబాబు తీరు మార్చుకోకపోతే ఆయన్ను రాజకీయ సమాధి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 
  • సీఎం టూ కామన్‌మెన్‌ వరకు వైయస్‌ జగన్‌ బటన్‌నొక్కి నేరుగా పేదల ఖాతాల్లో రూ.2.10 లక్షల కోట్లు జమ చేశారు.
  • వైయస్‌ జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ప్రజలంతా కూడా వైయస్‌ జగన్‌ వెంటే నడుస్తామని ఘంటా పథంగా చెబుతున్నారు.
  •  
Back to Top