దేవుడి దగ్గరకి వస్తున్న దెయ్యాల యాత్ర ఇది

మంత్రి గుడివాడ అమర్నాథ్
 

అమ‌రావ‌తి: అమ‌రావ‌తి రైతుల పేరుతో టీడీపీ నేత‌లు చేస్తున్న‌ది పాద‌యాత్ర కాద‌ని, దేవుడి  ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న దెయ్యాల యాత్ర అని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ మండిప‌డ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడారు. జీవితంలో అసెంబ్లీలోకి రానని మంగమ్మ శపథం చేసాడు చంద్రబాబు. ఇక ఈ ఆఖరి రోజుల్లో అసెంబ్లీ సీటు కాదు కదా..గేటు కూడా టచ్ చేసే పరిస్థితి లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలోకి వస్తానన్నదే బాబు శపథం. మళ్లీ బాబు అధికారంలోకి రావడం అనేది ఒక కలే. 
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. దాంతో రాజకీయంగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ ఆస్కారం లేకపోవడంతో రాజధాని అంశాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు. అమరావతి రాజధానిగా ఉండదు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు కానీ ఎప్పుడూ చెప్పలేదు. అమరావతితో పాటు, విశాఖ, కర్నూలు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని భావించి 3రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. 
రాజకీయపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఉత్తరాంధ్ర మీదకు ఉసిగొల్పుతున్నాడు చంద్రబాబు. అరసవెల్లి ఆలయానికి వచ్చి చంద్రబాబు ఏం మొక్కబోతున్నాడు?? మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి మా ప్రాంతం అన్యాయం అయిపోవాలని చెప్పి మా దేవుడికే మొక్కుతాడా? మా దేవుడి దగ్గరకి వచ్చి ఈ దెయ్యాలన్నీ మొక్కుతుంటే మేం ఎందుకు ఊరుకుంటాం? మా ప్రాంతం విశాఖకు మంచి జరగకూడదని బాబు భావిస్తే ఆ ప్రాంత ప్రజలు ఊరుకుంటారా? దేవుడి దగ్గరకి వస్తున్న దెయ్యాల యాత్ర ఇది. ఇది ఆ ప్రాంతం మీద వస్తున్న దండయాత్ర ఇది. దీన్ని ఎవరూ సహించరు. తిరగబడతారు. 

ఇదేమీ చంద్రబాబు రచించిన రాజ్యాంగం కాదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం. 

చంద్రబాబు అడిగాడని మేము ఎందుకు ఎన్నికలకు వెళ్లాలి?చంద్రబాబుకు నచ్చనప్పుడల్లా ఎన్నికలు పెట్టమని ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు. రాజ్యాంగంలో ఐదేళ్లు అని ఎందుకు పొందుపరిచారు? ఇదేమీ చంద్రబాబు రచించిన రాజ్యాంగం కాదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం. మాకు ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉండమని, అన్ని ప్రాంతాలకు మంచి చేయమని, రాష్ట్రంలో ఉన్న పేదవాడికి ఇచ్చిన హామీలు నిలబెట్టమని ఇచ్చిన అధికారం. 2024లో మేం తీసుకున్న నిర్ణయాలన్నీ రిఫరాండం అవుతాయి. మేం చేసిన DBT స్కీములు కానీ, మేం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన క్రమం కానీ, మూడు రాజధానుల నిర్ణయాలు కానీ తప్పకుండా రిఫరెండంగా పనిచేస్తాయి. అప్పటిదాకా ఆగలేకపోతున్నాడు చంద్రబాబు. బాబుకు ఓడిపోవడానికి అంత ఆసక్తి ఎందుకు? గెలిచేవాడు తాపత్రయపడినా పర్లేదు. ఓడిపోవడానికి బాబుకు అంత తాపతప్రయం ఎందుకు?
- మంత్రి గుడివాడ అమర్నాథ్

మాకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో పనిలేదు. ఈ ప్రాంతంలో ఉన్న 29గ్రామాలు, మా భూములు, మా రియలెస్టేట్ మాత్రమే పని అనే ఉద్దేశ్యం ఉంటే బాబును ఆ మాట చెప్పమనండి.  

మాకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో పనిలేదు. ఈ ప్రాంతంలో ఉన్న 29గ్రామాలు, మా భూములు, మా రియలెస్టేట్ మాత్రమే పని అనే ఉద్దేశ్యం ఉంటే బాబును ఆ మాట చెప్పమనండి. 
గడిచిన మూడేళ్లలో రెండున్నర ఏళ్లు కోవిడ్ తో పోరాటం చేసాం. అయినప్పటికీ నేటికీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఓ పక్క పరిశ్రమలు వస్తుంటే, ప్రతిపక్ష టీడీపీ డ్రగ్ పార్క్ వద్దు, ఇండస్ట్రీ వద్దు అంటూ కేంద్రానికి లేఖలు రాస్తోంది. ఒకవేళ ఏదైనా ఇండస్ట్రీ వస్తే అది మావల్లే వచ్చిందంటారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంటే, పెట్టుబడులు వస్తుంటే చంద్రబాబుకు కడుపుమంట. ఈ విషయాలన్నీ ప్రజలముందు ఉంచుతాం. శాసనసభ, మండలి ద్వారా ప్రజలకు అసలు వాస్తవాలేంటో చెప్పిచూపిస్తాం.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top