రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

  

తిరుపతి : రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి అన్ని వసతులు కల్పించి, పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలా దోహదపడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్లో శుక్రవారం జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పరిశ్రమల ఏర్పాటులో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఇండస్ట్రియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ డిజిటల్‌తో పాటు ఐటీబీసీ కంపెనీని మంత్రి ప్రారంభించారు. ఈ సదస్సులో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏపీఐసీసీ చైర్మన్ రోజా, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top