వైయ‌స్ జ‌గ‌న్ చెప్పిందే చేస్తారు.. చంద్ర‌బాబు చెప్పినా చేయ‌రు

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

 శ్రీ‌కాకుళం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పింది చేస్తార‌ని, చంద్ర‌బాబు చెప్పినా చేయ‌ర‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. గార మండలం వాడాడ పంచాయతీలో మంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నాలుగున్నర ఏళ్ళు అవుతోంది. మీరంతా ఓటు వేసి మ‌మ్మ‌ల్ని గెలిపించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నేతృత్వాన ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందు చెప్పినవి అన్నీ అమలు చేశాం. ఇవాళ మీ అభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు తెలుసుకునేందుకు ఇక్క‌డికి వచ్చాం.

రైతులకు పెద్ద ఎత్తున వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంది. చిన్న,చిన్న క‌మ‌తాలు కలిగిన రైతులను ఆదుకున్నాం. అలానే ప్ర‌తి ఏటా రైతు భ‌రోసా పేరుతో రూ.13,500 పెట్టుబడి సహాయం అందించాం. ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. భవిష్యత్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా పోటీ పరీక్షలకు తగ్గట్టుగా పాఠ్య ప్ర‌ణాళిక‌ల్లో మార్పులు చేశాం. కేవలం చదువు ఒక్కటే సామాజిక ఎదుగుద‌ల‌కు కార‌ణం అవుతుంది అని న‌మ్మి,అందుకు త‌గ్గ విధంగా ప్రోత్సాహం అందించాం.

ఆర్థిక,సామాజిక రంగాల‌లో అభివృద్ధి చెందేందుకు చదువు ఒక్కటే మార్గం అని వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం న‌మ్ముతోంది.  అందుకోసమే విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు అన్న‌ది చేశాం. జ‌గ‌న‌న్న విద్యా కానుక ద్వారా బెల్టు,షూ తో పాటే 12 ర‌కాల వ‌స్తువుల‌ను పిల్ల‌ల‌కు అందించాం. ఏటా అమ్మ ఒడి తో రూ.15 వేలు ఇచ్చి పిల్లల చదువు ఆ తల్లిదండ్రులకు భారం అవ్వకూడదు అని ఆర్థిక భ‌రోసా ఇస్తూ వ‌స్తున్నాం. ఇన్ని చేస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్ ను తప్పుగా చూపిస్తూ.. కథనాలు వేస్తున్నారు. రోజూ వివిధ మీడియాల‌లో అబద్ధాలు రాస్తున్నారు.. అవి వారికి కూడా తెలుసు.. అబ‌ద్ధాలు అని ఏనాడూ తెలియ‌ని విధంగా, అమ‌లుకు నోచుకోని విధంగా పథకాలు అందిస్తుంటే.. తప్పుగా చూపిస్తున్నారు..

మొన్న ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతరేకంగా ఓటు వేసిన వారికి ఎవరికైనా కూడా ఈనాడు పథకాలు ఆగాయా ? రేపు ఓటు వేయకపోయినా ? ఇంటి మీద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా క‌ట్టినా క‌ట్ట‌క‌పోయినా ప‌థ‌కాలు అన్న‌వి ఆగాయా ? ఆకలి, కన్నీరు, పేదరికం, అర్హ‌త ఒక్కటే చూసి పథకాలు వర్తింప‌చేస్తున్నాం. ఇది కదా గొప్ప నాయకత్వం అంటే.. ఈ ప్రభుత్వానికి రాష్ట్ర లో ఉండే పేదలూ, ప్రభుత్వ సహాయం కోసం ఉన్న వారూ అందరూ సమానమే. కేవలం పెద్ద వారికి దోచి పెట్టాడు చంద్రబాబు. ప్రజలకు చెందాల్సిన ధనం అంతా ఒక వర్గానికి దోచి పెట్టారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వృథా అన్నారు రెండేళ్ల క్రితం చంద్ర‌బాబు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంత కంటే ఎక్కువ ఇచ్చేస్తా అంటున్నారు. అంటే స్థిరమైన ఆలోచనలు చంద్రబాబు కి లేవు అన్న‌ది స్ప‌ష్టం అయిపోయింది.

2014 ఎన్నికల్లో మహిళ సంఘాలకు ఉన్న బ్యాంకు అప్పులు తీర్చేస్తా అని చంద్రబాబు చెప్పి,మోసం చేశారు. అలానే రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు.. కానీ చేయ‌లేదు. అందరినీ మోసం చేశారు. ఆ రోజు మహిళా సంఘాలకు జగన్ పాదయాత్ర లో చెప్పిన విధంగా ఇప్పటికే మూడు సార్లు బ్యాంకులకు చెల్లించారు..మరొక్క విడ‌త చెల్లించాల్సి ఉంది.. జనవరిలో ఆ మొత్తాల‌ను కూడా బ్యాంకు ఖాతాలకు జ‌మ చేస్తారు. చెప్పింది చేసే వారు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి.  చెప్పింది చేయని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు అనుభవం,వయసు అన్నవి మోసగించేందుకు తప్ప దేనికి పనికి రావు.

తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాలి అని ఆనాడు వైయ‌స్ఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే,వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. వైఎస్ఆర్ భావజాలం తో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. 12 వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించి, 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. చంద్రబాబు మాత్రం ఆరోజు ప్రభుత్వ భూమి ఉంటే ఇళ్ళ కోసం ఇచ్చారు. కానీ సీఎం జగన్ ప్రైవేటు భూమి కూడా కొని పేదలకు పట్టాలు ఇచ్చారు. అలానే  ఇవాళ పేద‌ల‌కు కేటాయించిన స్థ‌లాల‌లో నిర్మాణాలు పూర్తి అవ్వబోతున్నాయి.. అవి ఇళ్లు కాదు ఊళ్లు..జ‌గ‌న‌న్న కాల‌నీల పేరిట నిర్మితం అవుతున్నాయి. జగన్ సీఎం అవ్వకపోతే..ఇంత మంది సొంత ఇంటి కల నెరవేరేనా ? వైద్యం వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి,ఇంటి వద్దనే వైద్యులు వచ్చేందుకు కృషి చేశారు.

విప‌క్ష పార్టీకి చెందిన లోకేశ్  అంటున్నారు.. వైయ‌స్ జగన్ పిచ్చోడు... అని..! ప్రజల జీవితాల్లో మార్పు తీసుకుని వ‌చ్చి, ధ‌నవంతుల పిల్లల్లా పేదపిల్లలకు మంచి విద్యను అందిస్తుంటే వైయ‌స్ జగన్ పిచ్చోడా.. ? మీరే పిచ్చోళ్లు. అధికారం ఉన్నరోజు మీరు పేదలకు ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు మంచి చేస్తున్న వైయ‌స్ జగన్ మీద ఏడుస్తున్నారు అని మంత్రి ప్రసాదరావు అన్నారు.

 యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మండల వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు పీస గోపి డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి ఎంపీపీ గుండు రఘురాం, సర్పంచ్ సుంఖానా సురేష్, శ్రీశయన  కార్పొరేషన్ చైర్మన్ డిపి దేవ్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణమూర్తి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు మార్పు పుద్వీ,కన్వీనర్  పీసా శ్రీ హరి, వైస్ ఎంపీపీ అరవల రామకృష్ణ, అంధవరపు బాలకృష్ణ, స్థానిక నాయకులు తేజ, అప్పలనాయుడు,చింతనిప్పుల దాసు,  కంచు రవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top