శ్రీకాకుళం: చంద్రబాబు ది ముష్టి పరిపాలన అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. సీఎం వైయస్ జగన్ పాలన మిగతా పాలనకు భిన్నంగా ఉంటుంది.. అన్ని రంగాలలో మార్పులు తీసుకు వచ్చారని చెప్పారు. రాజదాని పేరు చెప్పి వ్యాపారం చేసుకునే చంద్రబాబుకు పేదవాడి కష్టాలు ఎప్పుడు తెలుస్తాయి. ఇలాంటివి మాట్లాడుతాననే చంద్రబాబు ఇక్కడికి వచ్చి నన్ను తిడతాడని ధ్వజమెత్తారు. ఇప్పిలిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ఏమన్నారంటే.. చంద్రబాబు వి పనికిమాలిన మాటలు...ప్రజలు ఇవేవీ పట్టించుకోరు. ముష్టి పరిపాలనలో ఇసుమంత మార్పు తెలీదు...నువ్వా చెప్పేది...ఈ పాలనను విమర్శించేది ఈ జిల్లాలో 14 ఏళ్ల పాలనలో నువ్వు తెచ్చిన ఒక్క ప్రాజెక్ట్ చెప్పు చంద్రబాబు. చెవులు లేవు, కళ్ళు లేవు ...రెండింటిలో రెండు బిండలు పెట్టుకున్నావు. నీకు అభివృద్ధి ఎలా కనిపిస్తాది చంద్రబాబు నీకు నాలెడ్జ్ లేదు...ఉన్నలెడ్జ్ తో ప్రజలకు మాయ చేసావు. అభివృద్ధి అంటే ఇవాల్టికి నీకు తెలియకపోవటం మా దురదృష్టం. నీకు అధికారం ఇస్తే అమరావతి, రియల్ ఎస్టట్ తప్ప ఇంకేమి చేస్తావు. 25 అంతస్తుల భవనం కాదు అభివృద్ధి అంటే...ప్రజల జీవన స్థితిగతుల సూచికను పెంచటమే అభివృద్ధి ప్రజల అవసరాలకు తగిన పాలన తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.ఈరోజు ప్రతీ గ్రామంలో ప్రజలు సంతోషంగా ఉండేందుకు కారణం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఇంకో 20 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి cm గా కొనసాగితే రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుంది మన పిల్లలు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఉద్యోగాలు పొందలేక పోతున్నారు..దీనికి గత పాలకులు బాధ్యులు కాదా? ప్రభుత్వ పాఠశాలలు ఈ స్థాయిలో మార్పు వస్తుందని మనం కలలో అయిన ఊహించామా ? 40 ఏళ్ల ప్రజా జీవితంలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో మీ అందరి సంహకారంతో వైయస్ఆర్‌సీపీ నేతృత్వాన ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. 77 ఏళ్లు అవుతోంది స్వాతంత్య్రం వచ్చి,మిగిలిన ప్రభుత్వాల పాలన కన్న భిన్నంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన సంబంధిత విధి విధానాలు ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలన సంస్కరణలు తెచ్చి ప్రజా జీవితాల్లో ప్రియతమ ముఖ్యమంత్రి అన్ని వర్గాల్లో వెలుగులు నింపారు. వారి జీవన ప్రమాణాలను పెంచారు. అందుకు తగ్గ విధంగా సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి నాటి పాదయాత్రలో ఆయన గుర్తించిన ప్రతి సమస్యకూ పరిష్కారం చూపారు. అలానే ప్రతి హామీని నెరవేర్చారు. ప్రజా పాలనకు,ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం చెప్పారు. పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఎదగాలని, అవకాశాలు అందుకోవాలని ఓ సదుద్దేశంతో విద్యావ్యవస్థలో మార్పులు చేశారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించేందుకు సర్కారు బడులను నాడు నేడు పేరిట ఆధునికీకరించారు. అలానే కొత్త సిలబస్ రూపకల్పన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విధంగా ఆన్లైన్ మెటీరియల్ పంపిణీ,ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ వంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. లోకేష్ మొద్దబ్బాయి నారా లోకేష్ మొద్దబ్బాయి కాబట్టే తనకు ఏం తెలియదు. తెలియకుండానే ఆయన మాట్లాడుతున్నారు. వ్యాఖ్యలు చేస్తున్నారు. అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారు. ఆ..రోజు అధికారంలో ఉండగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అనుకున్న వారికి పేదవారి కన్నీరు,ఆకలి,బాధ,దుఃఖం అన్నవి ఎలా తెలుస్తాయి. రాజదాని పేరు చెప్పి వ్యాపారం చేసుకునే చంద్రబాబుకు పేదవాడి కష్టాలు ఎప్పుడు తెలుస్తాయి రాజధాని పేరుతో వ్యాపారం చేసిన చంద్రబాబుకూ, పేదల కోసం నిరంతరం ఆలోచన చేసి, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేసిన జగన్ కూ పోలికా ? అని విపక్ష నేతలను నేను ప్రశ్నిస్తున్నాను. రా కదలి రా పేరిట నిన్నమొన్నటి వేళ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నలభై ఏళ్ల ప్రజా జీవితం ఉన్న చంద్రబాబు మాట్లాడే మాటలేనా అవి అనిపించింది. పస లేని ప్రసంగం ఇచ్చారు. ఇవాళ పుట్టిన బిడ్డ నుండి విదేశీ విద్యకు వెళ్లేవరకూ అన్ని బాధ్యతలూ ఈ ప్రభుత్వం తీసుకుంది. ఉచితంగా వైద్యం చేయిస్తున్న ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం. పూర్వ పేదలకు వైద్యం అందాలంటే చాలా కష్టం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. అలానే సంచార వైద్యశాలలూ ఉన్నాయి. 65 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. మండల స్థాయిలో ఇద్దరు డాక్టర్లతో ఓ ఆస్పత్రి నడుస్తోంది. ఒకవేళ అక్కడ నయం కాకపోతే జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ఇంకా నయం కాకపోతే పాతిక లక్షల రూపాయలతో ఆరోగ్య శ్రీ పథకం సంబంధిత కార్డు దారులకు వర్తింపజేస్తున్నారు. అలానే వైద్య ఆరోగ్య శాఖలో 58వేల మంది వైద్య సిబ్బందిని రిక్రూట్ చేశారు. ఆ విధంగా వైద్య వ్యవస్థను నిలబెట్టడం జగన్ వల్లే సాధ్యం అయింది. ఇవాళ పేదవాళ్లు ఎవ్వరైనా అనారోగ్యం పాలైతే నాకు ఈ ప్రభుత్వం తోడుంది అన్న భరోసాని కల్పించగలిగాం. ఇది కాదా మార్పు అంటే..?ఇది కాదా ఉత్తమ పాలన అంటే..? అని నేను విపక్షాలను అడుగుతున్నాను. చంద్రబాబు ది ముష్టి పరిపాలన ఆ రోజు చంద్రబాబు నాయుడు ముష్టి పరిపాలన చేశారు.సిగ్గూశరం అన్నవి ఉన్నాయా అని అడుగుతున్నాను ? ఆ రోజు కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు జిల్లా కేంద్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు మార్కెట్ కు ఎన్ని సార్లు వెళ్లారు ? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎన్ని సార్లు వెళ్లారు ? ఆ రోజు ఆ ప్రాంతం అభివృద్ధికి ఏమయినా కృషి చేశారా ? కనీస స్థాయిలో దృష్టి సారించారా ? తట్టెడు కాంక్రీట్ అయినా వేశారా ? ఒక్క షాప్ అయినా నిర్మించారా ? ఈ రోజు మీరు నగరంలో ఉన్న పెద్ద మార్కెట్ ను చూడండి మీకే తెలుస్తుంది. రహదారుల అభివృద్ధి అన్నది ఏ విధంగా ఉందో అన్నది మీకే తెలుస్తుంది. మేం చేసే అభివృద్ధి అన్నది టీవీ5,ఏబీఎన్ ఆంధ్రజ్యోతి,ఈనాడుకు కనిపించదు. పద్నాగేళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా ? రిమ్స్ (మెడికల్ కాలేజ్),అంబేద్కర్ యూనివర్శిటీ,వంశధార ప్రాజెక్టు సెకండ్ ఫేజ్,ఇంకా 35 వంతెనలు తీసుకుని వచ్చినవి కాదా.? రహదారుల పనులకు నిధులు తీసుకుని వచ్చాం. ఇప్పుడు ఏడు వందల కోట్ల రూపాయలతో ఉద్దానం ప్రాంతానికి సర్ఫేస్ వాటర్ ను అందిస్తున్నాం. 4 వేల కోట్లతో మూల పేట పోర్టు,బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్,అలానే గ్రామ,వార్డు సచివాలయాల పేరిట ఊరూరా పరిపాలన భవనం ఏర్పాటు చేశాం. ఆ రోజు చంద్రబాబు ఏం చేశారు ? ఆయనకు అభివృద్ధి పై కనీస అవగాహన లేదు. పేదల స్థితి గతులు మారి నాడే అసలైన అభివృద్ధి. సీఎం వైయస్ జగన్ ముఖ్య మంత్రిగా మరో 20 ఏళ్లు ఉంటే ప్రతి ఇంట్లోనూ సంపద ఉంటుంది. దొంగ వేషాలు ఎవ్వరూ వేసినా వారి అంతు చూసే వ్యక్తి సీఎం జగన్. తప్పు ఎవరు చేసిన ఒప్పుకోరు ఆయన. ఐదేళ్లలో ఐదు సార్లు మాట మార్చిన వ్యక్తి చంద్రబాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ మా మ్యానిఫెస్టో అమలు సాధ్యం కాదని ఐదు సార్లు మాట మార్చారు చంద్రబాబు. కానీ ఇప్పుడు మ్యానిఫెస్టో అమలు అయ్యాక ఇంతకుమించి మీకు ఇస్తాం అని అంటున్నారాయన. చంద్రబాబుకు మళ్ళీ అధికారం ఇస్తే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు. శ్రీకాకుళం నుంచి నేను మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తున్నా శ్రీకాకుళానికి ఏం చేశారో చెప్పగలరా ? వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మంత్రిగా నేను కానీ, సీఎం వైయస్ జగన్ కానీ,ఇంకా ఏ ఇతర అమాత్యులు ఎవ్వరు కానీ ఇసుమంత తప్పు చేయలేదు. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.