ఏలూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా జీవిస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. దెందులూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. అవినీతి అనేది ఒక అవమానకరమైన స్థితి.. అవినీతి ఉంటే పాలనకు మంచి పేరు రాదు.. అందుకే అవినీతి నిర్మూలనపై ఎక్కువ దృష్టి పెట్టాం.వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చింది. పరిపాలన వికేంద్రీకరణ జరిగి, అవినీతిలేని పాలన అందడంతో ప్రజలు సంతృప్తి చెందే పరిస్థితి ఏర్పడింది. ఒక స్థాయి వరకు అవినీతి తొలగించాము.. మరిన్ని విధానాలు అవలంభించి పూర్తి స్థాయిలో ఎక్కడా అవినీతి కనిపించకుండా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. రెండేళ్లు కరోనాలో గడిచిపోయిన ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పరిపాలన అందించాం.. దేశం అంతా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని చూస్తోంది.. ఒక వ్యక్తి వాలంటీర్స్ ని అవమానిస్తే రాష్ట్రమంతా ఆందోళనలు వెల్లువెత్తాయంటూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత వాలంటీర్లు ఆందోళనకు దిగిన సందర్భాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు.