జీవన ప్రమాణాల పెంపే దేయం ధ్యేయం

 రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు

 శ్రీకూర్మంలో గడప గడపకూ మన ప్రభుత్వం

  పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం.

శ్రీ‌కాకుళం: పౌరుల జీవన ప్రమాణాల పెంపే ధ్యేయం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు.  శ్రీకూర్మంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 25 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం టైప్ - 2 భవనం ప్రారంభించారు. నాడు - నేడు ప్రణాళికలో భాగంగా పొందర వీధి లో,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 16 లక్షల రూపాయలతో నిర్మించిన భవనం ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్ష లు అందించారు. అలానే ఇక్కడి ప్ర‌భుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి 51 ల‌క్ష‌ల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించి సంబంధిత వర్గాలకు అభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గడప గడపకూ మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని 17 నెలలుగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు గార మండలంలో ముగింపు..కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ పాలనలో గొప్ప గొప్ప మార్పులు చేశాము..ఆ మార్పు లతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా ? లేదా ? ఇంకా వారికి ఏయే అవసరాలు ఉన్నాయి అన్నవి తెలుసుకునేందు కు ప్రాధాన్యం ఇస్తున్నాం.ఇవాళ ప్రభుత్వం,ప్రభుత్వంలో విధులు నిర్వర్తించే అధికారులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కలిసి పని చేస్తూ,ఈ గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా మీతో మమేకం అవుతున్నాం. చాలా చిత్తశుద్ధితో 17 నెలలు ఈ కార్యక్రమం చేపట్టాం. అందరు అధికారులూ చాలా సమర్థవతంగా పని చేశారు. అనుబంధ అధికారులు కూడా బాగా పనిచేశారు. వీరితోపాటే సచివాల యం సిబ్బంది,వలంటీర్లు కూడా చక్కగా పనిచేసి సత్ఫలితాలు తీసుకు వచ్చేందుకు కృషి చేశారు. గడప గడపకూ..నిర్వహణలో భాగంగా గడిచిన 17 నెలలలో మనం ఇంటింటికీ వెళ్ళినప్పుడు సమాజంలో వచ్చిన మార్పును చూశాం. అది నాలుగున్నరేళ్లలో వచ్చిన మార్పు. 75 ఏళ్ల స్వాతంత్ర లో ఏ రాజకీయం పార్టీ అధికారంలోకి వచ్చినా..ఆ పార్టీ గుప్పెట్లోనే అధికారం ఉండేది. సంబంధిత వ్యవహారం నడిచేది. బలహీనులు ఎప్పుడూ వెనుక వెనుకనే ఉండే వాళ్ళు. తాము ఎన్నుకున్న  పాలనలో బితుకుబితుకుమంటూ బతికేవారిలో ఇవాళ ఓ ధైర్యం వచ్చింది. వైయ‌స్ఆర్‌సీపీ  పాలనలో మార్పు వచ్చింది. దేశంలో అందరూ హాయిగా జీవించాలి అన్నది రాజ్యాంగం నిర్దేశిస్తోంది.

రాజ్యాంగం కల్పించిన హక్కులను వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మీకు క్రమం తప్పక అందిస్తోంది. జీవన ప్రమాణాలు పెంపొందిస్తోంది. ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాం.  నాలుగున్నరేళ్లలో గ్రామాల్లో ఉండే స్కూల్స్, గ్రామ సచివాలయం బిల్డింగ్స్, వెల్నెస్ సెంటర్స్,రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇవన్నీ అభివృద్ధి కాదా .. అని నేను విపక్షాలను అడుగుతున్నాను. ఇవన్నీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపయోగం కాదా.. ? అని నేను వారిని అడుగుతున్నాను. గత ప్రభుత్వాల హయాంలో పనిచేసిన వారెవ్వరూ ఇవి చేయలేదు కనుకనే..వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వీటిని చేస్తోంది. మరో 20 ఏళ్ళు జగన్ ముఖ్య మంత్రిగా ఉంటే అన్ని వ్యవస్థలు బాగుపడతాయి. 

నీరూ - చెట్టు..పేరుతో చెరువుల అభివృద్ధి అంటూ బ్రోకర్స్ ని తయారు చేసింది నాటి ప్రభుత్వం. సంబంధిత ప్రజల డబ్బును తమ వారికి లబ్ధి చేకూరే విధంగా, సంబంధిత పెద్దల జేబుల్లో నింపేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇవాళ మన ప్రభుత్వం అలా కాదు. వై.ఎస్.జగన్ హయాంలో నడుస్తున్న ప్రభుత్వం ఇవాళ విద్యకు వైద్యానికి సమున్నత ప్రాధాన్యం ఇస్తోంది. విద్యలో సమూ ల మార్పులు చేశాం. ఏటా జగనన్న కానుక పేరిట బుక్స్, షూస్, బెల్ట్, యూనిఫాం,బెల్ట్..తో పాటు 12 రకాల వస్తువులను అం దించాం. డిజిటల్ క్లాస్ రూమ్ ను ఏర్పాటు చేశాం. మంచి ఫర్నిచర్ ను అందించాం. అలానే తమ పిల్లలను బడికి పంపే తల్లులకు ఆర్థికంగా భారం కాకుండా ఉండేందుకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నాం. పిల్లలంతా ప్రపంచంతో పోటీ పడాలి అని ఇంగ్లీష్ మీడియంను తీసుకు వచ్చాం. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక వర్గానికే ఇస్తున్నాం అని చెప్పగలరా.. లేదా..ఫలానా పథకం ఇస్తూ..వైయ‌స్ఆర్‌సీపీనాయకులు జేబులు నింపుకుంటునారు అని చెప్పాగలరా..లేదు..చెప్పలేరు..అవి ఏవీ జరగడం లేదు..

ఆ విధంగా పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ పాలన అందిస్తున్నాం. పరిపాలనలో వికేంద్రీకరణను సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకు వచ్చి, సంబంధిత వర్గాలను విజయవంతంగా నడిపిస్తున్నాం. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చేక మండల హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళే రోజులు లేవు. నాలుగున్నరేళ్లలో రైతుల ఖాతాలో 2 వేల కోట్ల రూపాయలు జమ చేశాం. ఏ ఉద్యమం జరిగింది అని 31 లక్షల మందికి సొంత ఇంటి కల నెరవేరింది.. చెప్పగలరా ? మంచి మనసున్న ముఖ్యమంత్రి గా జగన్ ఉన్నారు కనుకనే ఇది సాధ్యం అయ్యింది. 

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, ఎంపిపి గొండు రఘురాం, మండల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు పీస గోపి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ, సర్పంచ్ గోరు అనిత, మాజీ ఎఎంసి చైర్మన్ బరాటం నాగేశ్వర రావు,   వైస్ ఎంపిపి అంధ వరపు బాల కృష్ణ, వైఎస్సార్సీపీ నేతలు అల్లు లక్ష్మి నారాయణ, కెప్టెన్ ఎఱ్ఱన, యళ్ళ నారాయణ, కొయ్యాన నాగభూషణం,  కోట రామారావు, అరవల రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top