శ్రీకాకుళం: రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ రాజ్యం అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పాలితులుగా ఉన్నవారు పాలకులుగా మారారో వారికి వీటిని వివరించాల్సిన ఆవశ్యకత ఉంది..అందుకే బస్సు యాత్ర చేపడుతున్నామని అన్నారు. ఈ మార్పును ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు బస్సు యాత్ర చేపడుతున్నామని తెలిపారు. వృత్తి కులాలకు చెందిన వారికి ఆదరువుగా నిలిచిన ప్రభుత్వం ఇది. ఇదంతా మార్పు.. నిధులలో దుర్వినియోగం లేదు. అందుకే విపక్ష నాయకులు అవినీతి ఆరోపణలు చేయలేకపోతున్నారు. వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన సామాజిక న్యాయ భేరి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్దేశాలనూ, నిర్ణయాలనూ, ఆచరణాత్మక వైఖరినీ, దృక్పథాన్నీ, సంకల్పాన్నీ వివరించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బడుగులకే అవకాశాలు , అధికారాలు.. అన్నదే ధ్యేయం వైయస్ఆర్‌సీపీ సర్కారు మూడేళ్ల పాలన పూర్తయింది. ఈ సందర్భంగా బస్సు యాత్ర చేపడుతున్నాం. ఈ మూడేళ్ల కాలంలో తీసుకు వచ్చిన ప్రధానం అయిన మార్పు ఏంటి అన్నది చెప్పేందుకే యాత్ర .. చేపడుతున్నాం. ఈ దేశంలో స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటిష్ వారి కాలంలో సామాజిక న్యాయం అనే అంశంపై పలు రకాల ఉద్యమాలు నడిచాయి. బ్రిటిష్ వారి పాలనలో కూడా వివిధ వెనుకబడిన వర్గాల వారికి చోటివ్వాలి అన్న డిమాండ్ మేరకు సంబంధిత వర్గాల ఉద్యమాల మేరకు 1909 లో, 1919లో ,1935 లో చట్టాలు తెచ్చారు. స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగం అమల్లోకి వచ్చాక కొన్ని ఫలాలు కొన్ని వర్గాలకే అందాయి. బడుగులకు అవకాశాలు ఇచ్చే విషయమై రాజ్యాంగంలో ఓ క్లాజ్ లో ప్రస్తావించి, తద్వారా రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు. వాస్తవానికి పాలనలో మేం ఓ భాగం కావాలి అని బడుగులు భావించడం అన్నది ఈ రోజుది కాదు. ఎప్పటి నుంచో ఉంది. వీటికి అనుగుణంగా ఉద్యమాలు వచ్చాయి..ఆందోళనలు వచ్చాయి. రాజకీయ అధికారం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం విపక్షాలకూ...సంబంధిత వర్గాలకూ..వెనుకబడిన వర్గాలకు సంబంధించి పాలనలో సమున్నత అవకాశం అన్నది వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యం అయింది. 74 శాతం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అవకాశం ఇచ్చి సంబంధిత వర్గాలకు మనోవాంఛను నెరవేర్చారు. రాజకీయ అధికారం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు. రాజకీయ అధికారంతోనే విద్యతో పాటు ఇతర అవకాశాలు అందించినప్పుడే సామాజిక న్యాయం దక్కించడం సాధ్యం అవుతుందని వైయస్ జగన్ భావించారు. ఈ క్రమంలో ఎవ్వరూ అడగకుండానే తనంతట తాను విశాల భావజాలం ఇముడ్చుకుని సంబంధిత నిర్ణయాలను వెనువెంటనే అమలు చేశారు. ఈ రాష్ట్రంలో సంపూర్ణమయిన ఆర్థిక వనరులలో అగ్రభాగం నేరుగా బీసీలకే అందుతోంది. 82 శాతం వెళ్తుంది. పంచిపెట్టడం అన్నది ఓ హేళనగా మాట్లాడుతోంది విపక్షం. రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు పాలన జరిగిందో చెప్పాలి ? అన్నది నా డిమాండ్. మార్పు అంటే ఇది... రాజ్యాంగానికి అనుగుణంగా ఇన్నాళ్లకు పాలన చేసే నాయకుడు వైయస్ జగన్ రూపంలో దొరికింది. గ్రామీణ ప్రాంతాల్లో వెనుక బడిన వర్గాలు ఏనాడయినా తలెత్తుకుని జీవించే పరిస్థితులు ఉన్నాయా? ఎవ్వరి దగ్గర అయినా తలవంచాల్సిన అవసరం ఉందా? ఇదీ మార్పు అంటే ..! అవినీతి పరంగా ఏ ఒక్క కార్యక్రమం జరుగుతుందని కూడా ఆరోపణ చేయలేకపోయారు చంద్రబాబు. ఒకనాడు రాజీవ్ చెప్పిన విధంగా ఆనాడు పది శాతం మాత్రమే పథకాల లబ్ధి అర్హులకు చేరేదని, మిగతాది బ్రోకర్లకు చేరిపోతుందని గగ్గోలు చెందారు.. కానీ ఇప్పుడు అలా లేదు. రిజర్వేషన్లు అమలు చేసి ప్రభుత్వోద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేసిన దాఖలాలు ఉన్నాయి. యాభై శాతం బీసీలకు పదవులు స్థానికంగా దక్కించాం. ఇది కదా! మార్పు అంటే ఇది కదా సామాజిక న్యాయం అంటే ... అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరించారు.