పవన్‌ గుండు ఎపిసోడ్‌లోనే చిరంజీవికి అవమానం

మళ్లీ పుట్టినరోజున సొంత ఎజెండాతో అన్న‌ను అవమానించాడు

సీఎం వైయస్‌ జగన్, చిరంజీవి అన్నదమ్ముల్లా ఉంటారు

175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాన‌ని చెప్పే దమ్ము పవన్‌కు ఉందా..?

నారా, నాదెండ్ల, పవన్‌ శిఖండి మరో వెన్నుపోటుకు రెడీ అయ్యింది 

వైయస్‌ జగన్‌ ప్రజాబలం ముందు ఈ శిఖండి కుట్రలేవీ పనిచేయవు

వంగవీటి హత్య కేసులో చంద్రబాబు పాత్రలేదని ఒక్కరితోనైనా చెప్పించగలవా..?

రామోజీ ఫిల్మ్‌ సిటీలో అమిత్‌ షాతో బాబు కనిపించలేదే..?

పవన్‌ కంటే జూ.ఎన్టీఆర్‌ పోటుగాడు అని ప్రజలందరికీ అర్థమైంది

ప‌వ‌న్ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప్ర‌జ‌లంతా కోరుకుంటున్నారు

రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా

తాడేపల్లి: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో సక్సెస్‌ అయిన నారా, నాదెండ్ల ఇద్దరూ పవన్‌ కల్యాణ్‌ అనే శిఖండిని కలుపుకొని ప్రజలకు ఆప్తుడైన సీఎం వైయస్‌ జగన్‌ మీద కుట్రలు పన్నుతున్నారని, పవన్, నారా, నాదెండ్ల లాంటివారు మరో 300 మంది వచ్చినా వైయస్‌ జగన్‌ను ఏమీ చేయలేరని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్‌ కల్యాణ్‌ గుండు ఎపిసోడ్‌లోనే చిరంజీవికి పెద్ద అవమానం జరిగిందని, మళ్లీ ఆయన పుట్టినరోజున పవన్‌ కల్యాణ్ త‌న సొంత ఎజెండాతో అవమానించాడన్నారు. కానిస్టేబుల్‌ కొడుకును అని చెప్పుకునే పవన్‌.. చిరంజీవి తమ్ముడిని అని ఎప్పుడైనా చెప్పుకున్నాడా..? అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే ధైర్యం పవన్‌కు ఉందా అని నిల‌దీశారు.  తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి దాడిశెట్టి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా ఏం మాట్లాడారంటే..

‘‘సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో గడప గడపకూ మన ప్రభుత్వం అనే నినాదంతో ప్రతి గడపకూ తిరుగుతున్నప్పుడు ప్రజల స్పందన చూస్తుంటే మాకే చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంది. ఒక్క రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అర్హత ఉన్న ప్రతి  లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం నుంచి వచ్చిన సమాధాలు మాకు ఆనందాన్నిచ్చాయి. ఇది గమనించిన ప్రతిపక్షాలు రకరకాల కుట్రలు చేస్తున్నాయి. 

సీఎం వైయస్‌ జగన్‌ను ఇబ్బందులకు గురిచేయాలని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయి. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ను నాదెండ్ల  వెన్నుపోటు పొడిచి సక్సెస్‌ అయ్యాడు. రెండోసారి నారా చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సక్సెస్‌ అయ్యాడు. వారిద్దరూ కలిసి ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ అనే శిఖండిని కలుపుకొని నాదెండ్ల, నారా, పవన్‌ కల్యాణ్‌ అనే శిఖండి ప్రజలకు అత్యంత ఆప్తుడైన సీఎం వైయస్‌ జగన్‌ను ఏదోరకంగా వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే రకరకాల చిల్లర రాజకీయాలు. ఈ ముగ్గురు కాదు.. ఇలాంటివారు మరో 300 మంది వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌కు ఉన్న ప్రజాబలం ముందు ఏమీ చేయలేరు. 

చిరంజీవిని అవమానించారని పవన్‌ మాట్లాడుతున్నాడు. నేనే ప్రత్యక్షసాక్ష్యం. భీమవరం సభలో చిరంజీవి, సీఎం వైయస్‌ జగన్‌ ఆత్మీయతను చూశాను. సొంత అన్నదమ్ముల్లా ఉంటారు. ఇంకా పవన్‌.. కానిస్టేబుల్‌ కొడుకును అని చెప్పుకుంటాడు కానీ, చిరంజీవి సోదరుడిని అని చెప్పుకున్న పరిస్థితి లేదు. చిరంజీవికి నిజమైన అవమానం.. పరిటాల రవి పవన్‌కు గుండు కొట్టించినప్పుడు జరిగింది. చిరంజీవి చంద్రబాబును కలవడానికి వస్తే అధికార మదంతో చంద్రబాబు, పరిటాల రవి కలిసి చేసిన అవమానం చాలా పెద్దది. మళ్లీ పుట్టినరోజు పూట సొంత ఎజెండాతో మళ్లీ పవన్‌ అవమానించాడు. 

వైయస్‌ఆర్‌ సీపీ గతం నుంచి అడుగుతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే దమ్ము పవన్‌కు ఉందా..? చంద్రబాబు చెబితే గానీ ఎన్నిపోటీ చేస్తావో కూడా చెప్పలేని పరిస్థితి పవన్‌ది. అలాంటి నువ్వు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కావాలంటావ్‌.. కానీ, రాష్ట్ర ప్రజలు పవన్‌ కల్యాణ్‌ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే పవన్‌ ఎజెండా ప్రజలకు అర్థమైంది. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏమైనా అయితే.. 31 లక్షల ఇళ్లు, అమ్మఒడి పథకం, విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ ఈ విధంగా 40 పథకాలు కుంటుపడిపోతాయని ప్రజలంతా పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంటే.. ఈ పథకాలన్నీ ఏదోరకంగా ఆపేయాలనే దురుద్దేశంతో చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్‌.. వైయస్‌ఆర్‌ సీపీ విముక్త ఏపీ కావాలని కోరుకుంటున్నాడు. 

గత వారం రోజులుగా పత్రికల్లో అమిత్‌షా ఫిల్మ్‌ సిటీకి వస్తారని, చంద్రబాబుతో భేటీ అవుతారని రకరకాలుగా వార్తలు సృష్టించారు. అమిత్‌షా రామోజీ ఫిల్మ్‌ సిటీకి వచ్చారు.. చంద్రబాబు ఎక్కడా కనిపించలేదు. అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చి.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడి వెళ్లారు. చంద్రబాబుకు కూడా పవన్‌ లాగే సిగ్గులేదు. సీఎం వైయస్‌ జగన్‌ ఒకేరోజు ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసివచ్చారు. అయినా ప్రచారం చేసుకోలేదు. 

ఆంధ్రరాష్ట్రంలోని కాపుల గురించి పవన్‌ మాట్లాడుతున్నాడు. కాపులకు ఆరాధ్య దైవం అయిన వంగవీటి మోహనరంగా హత్య విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదని ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తితో అయినా చెప్పించగలవా..? తుని కాపు గర్జన విషయంలో చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించి హింసించాడు. వాటిని సీఎం వైయస్‌ జగన్‌ ఎత్తేశారు. బీజేపీకి దగ్గరగా ఉన్నానని చెప్పుకునే పవన్‌.. కాపుల తరపున వకల్తా పుచ్చుకొని సెంట్రల్‌ కేసు తీయించే ప్రయత్నం ఎప్పుడైనా చేశాడా..? కులం, మతం లేదని మాట్లాడుతూనే మరోపక్క కాపులంతా నాకు ఓట్లు వేయాలని అంటున్నాడు.  తుని కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు కాపు అక్కచెల్లెమ్మలను పెట్టిన చిత్రహింసలు కళ్లారా చూశాం. తుని కేసుల విషయం, వంగవీటి హత్య విషయంలో చంద్రబాబుకు క్లీన్‌ చీట్‌ ఇప్పించిన తరువాత సంకనాకుతానంటే పర్వాలేదు. అలా కాకుండా కాపులంతా నాతో నడవాలంటే ఎవ్వరూ ముందుకురారూ..’’అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top