అంతరించిపోతున్న కళలు సజీవంగా ఉండాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్ష 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
 

గుంటూరు: రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలు సజీవంగా ఉండాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్ష అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. నంది అవార్డుల ప్రదానోత్సవం గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ ఏడాది మొత్తం 73 నంది అవార్డులు ఇవ్వబోతున్నామని మంత్రి  తెలిపారు. 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొన్నారు. నాటక కళాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించామని చెప్పారు. నిరుత్సాహంతో ఉన్న కళాకారులకు ఇది గొప్ప అవకాశమని మంత్రి పేర్కొన్నారు.  వీధి నాటకాలను సైతం ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాల నుంచి ఎక్కువ మంది నాటక రంగంలోకి వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం పట్ల కళాకారులకు మరింత గౌరవం దక్కుతుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇప్పుడు ఇవ్వనున్న అవార్డులు ప్రతిబింబాలన్నారు. నాటకరంగంలో ఇదొక చారిత్రక ఘట్టమని మంత్రి చెప్పారు. 
 

Back to Top