వందేళ్ల తప్పిదాలను సరిదిద్దాలనుకుంటున్నాం

వ్యాపార లక్షణంతో చంద్రబాబు అమరావతి చేపట్టారు

విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ పెడితే భయమెందుకు?

వైజాగ్‌ ఏమన్నా అరణ్యమా?

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అసెంబ్లీ: వందేళ్లలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ..
బినామీ ప్లాట్లు, రిజిస్ట్రేషన్లు చూస్తే..రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, దమ్మలపాటి శ్రీధర్‌ రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. అమరావతి కోసం మంచి హృదయంతో నిర్ణయం తీసుకుంటే స్వాగతించాలి. కానీ వీళ్లు వ్యాపార ధ్రుక్పథంతో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములు వదిలిపెట్టలేదు. అమాయకులైన ఎస్సీల భూములను కొనుగోలు చేశారు. సబ్‌ రిజిస్ట్రర్‌ ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చేయకపోతే తరువాత ల్యాండ్‌ పూలింగ్‌ చేసుకొని, బలవంతంగా బెదిరించి లాక్కున్నారు. కొళ్లి శివరాం, గుమ్మడి సురేష్‌ వీరిద్దరు లోకేష్‌ బినామీలు. బులుసు శ్రీనివాసరావు, నిమ్మగడ్డ శాంతకుమారి, తదితరుల పేర్లతో 300 ఎకరాలు కొనుగోలు చేశారు.
దాదాపు 28 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు భూములు ఇస్తే..14 వేల మంది అమ్ముకున్నారు. ఇంత అన్యాయమైన పరిపాలన చేశారు. ఇంతటితో వదలకుండా భూములు అలాట్‌మెంట్‌ చేశారు.  ఇందులో పద్ధతి లేదు..పాలసీ లేదు. వివిధ యూనివర్సిటీలకు భూములు కేటాయించారు.1600 ఎకరాలు వివిధ సంస్థలకు ఇచ్చారు. ఇందులో 1300 ఎకరాలు ప్రైవేట్‌ వ్యక్తులకు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు ఇచ్చారు. ప్రైవేట్‌కు, ప్రభుత్వ సంస్థలకు ఏ రేట్‌కు భూములు ఇచ్చారో గమనిస్తే..కేంద్ర ప్రభుత్వానికి 5.50 ఎకరాలు కోటి రూపాయలకు ఎకరా ఇచ్చారు. ఇది 60 సంవత్సరాల వరకు లీజ్‌కు  ఇచ్చారు. ఇండియన్‌ నేవీకి 15 ఎకరాలు ఇచ్చారు. ఎకరా కోటి చొప్పున ఇచ్చారు. బీఐఎస్‌కు 30 సెంట్లు ఇచ్చారు. ఇది కూడా 60 ఏళ్లు లీజు, సీఏజీకి 15 ఎకరాలు, సీబీఐకి 3.50 ఎకరాలు, ఐజీఎన్‌వోయూ 80 సెంట్లు, ఐఎండీ ఎకరా ఇచ్చారు. ఇండియన్‌ ఆర్మీకి 4 ఎకరాలు ఇచ్చారు. రియల్‌ టైం కార్పొరేషన్‌కు ఎకరా రూ.4 కోట్లు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఎస్‌బీఐకి 1.30ఎకరాలు ఇచ్చారు. ఎకరా రూ.4 కోట్లు, నాబార్డుకు 4.30 ఎకరాలు, ఎఫ్‌సీఐకి 4 ఎకరాలు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు ఎకరా రూ.4 కోట్లు చొప్పున ఇచ్చారు. హెచ్‌పీసీఎల్‌, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కోర్‌ రిజినల్‌ ఆఫీస్‌, కేనరా బ్యాంకుకు ఎకరా నాలుగు కోట్ల చొప్పున ఇచ్చారు.
ప్రభుత్వ సంస్థలకు ఎకరా  రూ.4 కోట్ల చొప్పున 60 ఏళ్లు లీజ్‌కు ఇచ్చారు. యూనివర్సిటీకి 200 ఎకరాలు ఇచ్చారు. ఎకరా రూ.50 లక్షల చొప్పున, అమృత యూనివర్సిటీకి 200 ఎకరాలు, మరో యూనిర్సిటీకి 150 ఎకరాల చొప్పున  ఇచ్చారు. మెడిసిటీ ఆఫ్‌ హెల్త్‌కు 150 ఎకరాలు ఇచ్చారు. ఆశ్చర్యంగా భూములు కట్టబెట్టారు. పబ్లిక్‌ సర్వీసెస్‌ 180 ఎకరాలు, 7 కేంద్ర సంస్థలకు 69 ఎకరాలు ఇచ్చారు. స్టార్‌ హోటళ్లకు కూడా భూములు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.4 కోట్లు, ప్రైవేట్‌ సంస్థలకు మాత్రం ఎకరా రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు. అమరావతి కన్వేషన్‌ సెంటర్లకు కూడా భూములు ఇచ్చారు. విచ్చలవిడిగా భూములు కేటాయించారు. భూములన్నీ టీడీపీ నేతలు స్వాహా చేశారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ కొనుగోలు చేసి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారు. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంది.  ప్యారీస్‌ కడతామని భూములు తీసుకొని ఇష్టారాజ్యంగా ఇతరులకు కట్టబెట్టారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వెనుకబడ్డాయి. చాలా ఆలోచనతో ముందుకు పోతే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. ఈ పరిస్థితి చూసి వరల్డ్‌ బ్యాంకు వెనక్కి వెళ్లింది. రాష్ట్రమంతా అప్పులు తీర్చాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. రాయలసీమ పరిస్థితి దారుణంగా ఉంది.1952-53లో తీవ్ర కరువు నెలకొంది. అక్కడ కప్పలకు పెళ్లిలు చేస్తున్నారు. డొక్కల కరువు, పెద్ద కరువు, దాతు కరువు, ముస్టి కరువు వచ్చింది. చేపలు పట్టే వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు పాకిస్థాన్‌ వరకు వెళ్లి అక్కడ పట్టుబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అల్లూరి సీతారామారాజు వచ్చిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. తాగేందుకు నీళ్లు లేవు.  మా ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ చేయాలనే ఆలోచన లేదు. జరిగిన తప్పులన సరిచేయాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. రాబోయే 200 ఏళ్లు కూడా రాష్ట్రమంతా కలిసి కట్టుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వం చెప్పాపెట్టకుండా హైదరాబాద్‌ వదిలి ఇక్కడికి వచ్చింది.  తాత్కాలిక భవనాలు కట్టుకున్నారు. కరకట్టపైనే తిరుగుతున్నారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా వైజగ్‌ చేస్తామంటే ఎందుకు భయపడుతున్నారు. అంత మంచి నగరానికి అభివృద్ధి జరగాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ నక్సలైట్లు ఉన్నారని వారి పేపర్లలో రాస్తున్నారు. అమరావతి ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేవు. హైకోర్టు ప్రాంతంలో టీ దొరకదు. గతంలో ఎన్టీరామారావు తాలుకా వ్యవస్థ నుంచి మండల వ్యవస్థను తీసుకువస్తే అందరం స్వాగతించాం. ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ సారధ్యంలో గ్రామం వరకు పరిపాలన తీసుకెళ్తున్నాం.  దేశభాషలందు తెలుగు లెస్సా అని శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. ఈ బిల్లును అందరూ సంతోషంగా ఆమోదించాలి.

తాజా వీడియోలు

Back to Top