బీఏసీలోని ప్రతీ అంశంపై చర్చకు సిద్ధం

శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ

శాసనమండలి: బీఏసీలోని ప్రతి అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలిలో విపక్షాల తీరును మంత్రి బొత్స ఆక్షేపించారు. అమరావతిపై చర్చించాలని అనుకున్నప్పుడు బీఏసీలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీఏసీలోని ప్రతీ అంశంపై చర్చించడానికి ప్రభుత్వంగా సిద్ధంగా ఉందన్నారు. పబ్లిసిటీ కోసం టీడీపీ అమరావతి అంటోందని, అమరావతిపై చర్చకు టీడీపీ భయపడాలి.. తమకు ఎలాంటి భయం లేదన్నారు.  టీడీపీకి సమస్య పరిష్కారం కాదు.. రాజకీయ లబ్ధి మాత్రమే కావాలని ధ్వజమెత్తారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top