మా ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట

అట్టడుగు, అణగారిన వర్గాలకు ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడానికే బీసీ మహాసభ

విద్యాశాఖ‌ మంత్రి బొత్స సత్యనారాయణ

విజ‌య‌వాడ : సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అండగా నిలిచార‌ని, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి మేమున్నాం అనే ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడమే వైయ‌స్ఆర్ సీపీ ప్రధాన లక్ష్యమ‌ని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో "జయహో బీసీ మహా సభ" పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. 

``అధికారానికి ఒక ఆకారం ఉంటుందా.. పదవులు పొందిన బీసీలకు అధికారాలు లేవన్న విమర్శలు హాస్యాస్పదం. అదంతా ఎల్లో మీడియా సృష్టే. ప్రతిపక్షాలు కూడా అలాంటి విమర్శలు చేయడం బీసీలను కించపరచినట్లే అవుతుంది. బీసీ మహాసభ తర్వాత ఎస్సీ, ఎస్టీల సభలు కూడా నిర్వహిస్తాం. ఎవరినో విమర్శించడానికి ఈ బీసీ సభలు పెట్టడం లేదు. విమర్శలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాది అనే రీతిలో మేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం``

మా జ‌గ‌న‌న్న‌ పాల‌న‌లో సామాజిక న్యాయం: మంత్రి జోగి రమేష్..
``బాబు ఇదేం ఖర్మ అని తిరుగుతుంటే.. జనం చంద్రబాబుకు ఇదేం ఖర్మ.. అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఖర్మ పట్టి తిరుగుతున్నాడు. 84 వేల మంది బీసీ ప్రతినిధులతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో జయహో బీసీ అంటూ ఒక మహాసభ నిర్వహిస్తుంటే.. టీడీపీ వెన్నులో వణుకుపుడుతుంది. బీసీలను చంద్రబాబు అన్నివిధాలా ముంచాడు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి, సామాజిక న్యాయం చేస్తున్నారు. ఈ సభలో గడిచిన మూడున్నరేళ్ల‌లో వైయ‌స్ జగన్ నాయకత్వంలో మా ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది. బీసీలకు ఏం చేస్తామని చెప్పాం.. ఏం చేశాం.. భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నామో కూడా ఈ మహా సభలో చర్చిస్తారు. ఒక వీరుడు, ధీరుడు, ధీశాలి.. అయిన వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి 75 ఏళ్ళ స్వాతంత్ర్య భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, బలహీనవర్గాలను బలోపేతం చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన విజయవాడలో ఉప్పెనలా బీసీ మహా సభ జరగబోతుంది``.. అని మంత్రి జోగి రమేష్ వివరించారు. 

విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో బీసీ మ‌హాసభ ఏర్పాట్లను మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు మోపిదేవి వెంకటమణ, శ్రీమతి సత్యవతి, మార్గాని భారత్, ఎమ్మెల్యేలు కె. పార్థసారథి, అదిప్ రాజ్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, శ్రీమతి పోతుల సునీత, మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పి రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ కార్యకర్తల సమన్వయకర్త పుత్తా ప్రతాప్ రెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్  నారాయణమూర్తి, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Back to Top