ఉద్యోగులకు మేలు చేసేలా మెరుగైన జీపీఎస్ ప్రతిపాదనలు

 మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

ఆర్థికమంత్రి బుగ్గనతో కలిసి సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలతో చర్చలు

విజ‌య‌వాడ‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం) ఉద్యోగులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్‌ (గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం)ను ప్రతిపాదిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలిసి సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలతో చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో హామీ ఇచ్చాం. కానీ, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా ఉద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం. అందుకే సీపీఎస్‌ స్థానంలో అంతకంటే మెరుగైన జీపీఎస్‌ను ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు జీపీఎస్‌ వద్దు.. అవసరమైతే ఓపీఎస్‌ (ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం)లో కొన్ని అంశాలను సవరించమంటున్నారు. ప్రభుత్వం జీపీఎస్‌లో మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తానంటోంది. త్వరలోనే రెండింటి మధ్య ఎక్కడోచోట సమస్య పరిష్కారమవుతుంది. అప్పుడు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ విషయంలో ఉద్యోగుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఎన్నిసార్‌లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’.. అని బొత్స అన్నారు.

 

Back to Top