ఎన్నికల బహిష్కరణ అనేది టీడీపీ డ్రామా

మంత్రి బొత్స సత్యనారాయణ
 

విజయవాడ: పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ టీడీపీ అడిన డ్రామా అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీ ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని చెప్పారు. ప్రతిపక్షం తన పాత్రను పోషించకుండా ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు అబద్దాలు ప్రచారం చేశారన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు ఏమీ తెలియదనుకుంటున్నారా? వారు అమాయకులు అనుకుంటే పొరపాటేనని అన్నారు. టీడీపీ ఆలోచన చాలా తప్పు అని కొట్టిపారేశారు. టీడీపీకి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదన్నారు. ఓటమిని అంగీకరించి ఫలితాలను విశ్లేషించుకోవాలని హితవు పలికారు. మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారని, సుమారు 60 లక్షల మందికి ఇళ్ల పట్టాలను స్వాస్త్యంగా ఇవ్వాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనగా ఉందన్నారు. ఈ ఆస్తి నాది అనే ధీమాతో ఆ అక్కా, చెల్లి ఇంట్లో నిద్రపోవాలని సీఎం వైయస్‌ జగన్‌ తపన అన్నారు. దీనిపై విధివిధానాల గురించి సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారని తెలిపారు. త్వరలోనే 80 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top