పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

 

విశాఖ: పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. విశాఖలో వైయస్‌ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్, జక్కంపూడి రాజా, మేరుగ నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కొత్త పరిశ్రమల కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలు సిద్ధం చేశామని, విశాఖ కేంద్రంగా 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రభుత్వంపై ఎంత బురదజల్లాలని చూసినా ప్రజలు ఎవరూ నమ్మరన్నారు.

Back to Top