వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చేందుకు మహిళలే కారణం

గత ఐదేళ్లలో టీడీపీ చేసిన దోపిడీ పవన్‌కు కనిపించలేదా ?

మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మహిళలే ప్రధాన కారణమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో నిర్వహించిన డ్వాక్రా మహిళల రుణాల పంపిణీ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఐదేళ్లలో జరిగిన భూ దోపిడీ ఎక్కడా జరగలేదన్నారు. ఐదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన టీడీపీ నేతల లెక్కలు నా వద్ద ఉన్నాయని చెప్పారు. దమ్ముంటే ఈ విషయంపై టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాలు చేశారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్‌ ద్వారా నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. చరిత్ర తెలుసుకుని పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడితే మంచిదని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ చేసిన దోపిడీ పవన్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ వైయస్‌ జగన్‌ నెరవేర్చారని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎన్ని హామీలు నెరవేర్చాలో చెప్పాలని పట్టుపట్టారు. సంపూర్ణ మద్య నిషేధంతో మహిళల జీవితాల్లోకి కొత్త వెలుగును సీఎం వైయస్‌ జగన్‌ తీసుకురాబోతున్నారని చెప్పారు. 

Read Also: మానవత్వం చాటుకున్న మంత్రి కన్నబాబు

తాజా ఫోటోలు

Back to Top