విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహణ

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

విజయవాడ: తెలుగుదేశం పార్టీకి ఏ పని లేకే పరీక్షలపై విమర్శలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. కోవిడ్‌ సమయంలోనూ సమర్థవంతంగా క్లాసులు నిర్వహించామన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పరీక్షా కేంద్రానికి కోవిడ్‌ అధికారి నియమిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా పరీక్షా కేంద్రం, సీటు చూసుకునే విధంగా యాప్‌ రూపొందించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఏ అంశమూ దొరక్క లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 

Back to Top