వైయస్‌ జగన్‌ దమ్ము, ధైర్యం రాష్ట్ర ప్రజలకు తెలుసు

పవన్‌ కళ్యాణ్‌ను ఏమని పిలవాలో అర్థం కావడం లేదు

పవన్‌ పూర్తిస్థాయి పొలిటీషియన్‌ కాదు..పూర్తిగా యాక్టర్‌ కాదు

చంద్రబాబు డైరెక్షన్‌లో వైయస్‌ జగన్‌పై పవన్‌ విమర్శలు

పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాని

ప్రభుత్వంపై కడుపు మంటతోనే పవన్‌ విమర్శలు చేస్తున్నారు

రాయలసీమపై పవన్‌ది డబుల్‌ గేమ్‌

ఫ్యాన్స్‌ను సన్మార్గంలో పెట్టడం పవన్‌ నేర్చుకోవాలి

 మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దమ్ము, ధైర్యం ఏంటో ఈ రాష్ట్రప్రజలందరికీ తెలుసని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని హితవు పలికారు. కులాలు, మతాల గురించి పవన్‌ సంస్కారహీనంగా  మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముందుగా తన ఫ్యాన్స్‌ను సన్మార్గంలో పెట్టడం నేర్చుకోవాలని హితవు పలికారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ మీడియాతో మాట్లాడారు.  పవన్‌ కళ్యాణ్‌ను ఏమని పిలవాలో అర్థం కావడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అని ప్రతిపక్ష నాయకుడు అని పిలవాలంటే కనీసం ఆయన రెండుచోట్ల పోటీ చేసి  ఒక్కచోట కూడా గెలవలేదు. సినిమా హీరో అందామంటే అవికూడా అపేశారు. వేషాలు లేక రాజకీయాల్లో ప్యాకేజీలతో బతుకుతున్నారు. రెండు లక్షల పుస్తకాలు చదివాడని ఆయన్ను మేధావి అందామనుకుంటే అంతకన్న అజ్ఞానం ఉండదు. ఇక ఆయన్ను ఏమని పిలవాలంటే..గతంలో హచ్‌ అనే కంపెనీ ఓ యాడ్‌ వచ్చేది. చంద్రబాబు డైరెక్షన్‌ ఇస్తే దాన్ని ఫాలో అవుతున్నారు. ఆయన ఒక జిల్లా వెళ్తే..ఈయన మరో జిల్లా వెళ్తున్నారు. వేరెవర్‌ యూ గో ఐ ఫాలోయింగ్‌ చంద్రబాబు అన్న విధంగా ఫాలో అవుతున్నారు. ఆయన్ను పవన్‌ నాయుడు, కళ్యాణ్‌ నాయుడు అంటే బాగుంటుందని నామకరణం కూడా చేయించారు. 

పవన్‌ కళ్యాణ్‌ నిన్న రైల్వే కోడురుకు వెళ్లి..జగన్‌ మోహన్‌ రెడ్డికి దమ్ము, ధైర్యం లేవని అంటున్నారు. ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ..ఆ రోజు సోనియాగాంధీని ఎదురించిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తూ 2019లో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన వైయస్‌ జగన్‌ దమ్ము, ధైర్యం ప్రజలందరికీ తెలుసు. 2014లో ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి..ఎవర్ని ప్రశ్నించకుండా ఆ రోజు అధికార పార్టీకి తొత్తుగా, మౌత్‌పీస్‌గా వ్యవహరించిన పవన్‌..ఈ రోజు మరోసారి చంద్రబాబుకు తా..అంటే తాందాన అంటూ వైయస్‌ జగన్‌ దమ్ము గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైయస్‌ జగన్‌ దమ్ము, ధైర్యం తెలుసు..పవన్‌ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌..నీవు జగన్‌ రెడ్డి అని పిలిస్తే.. ఎవరు పట్టించుకుంటున్నారు. నీవు పిలిచినా, పిలవకపోయినా వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చంద్రబాబు చెప్పినట్లు పదే పదే జగన్‌ కులాన్ని ప్రస్తావిస్తున్నావే తప్ప మరొకటి లేదు. నీవు మాట్లాడిన భాషా చూస్తే..నీవు పుస్తకాలు చదివినట్లు కనిపించదు. రాయలసీమలో ఒక పక్క కరువు అంటాడు, మరోపక్క పచ్చని పొలాలు అంటాడు. మరొపక్క నాయకుల పొలాలే పచ్చగా ఉన్నాయంటారు. ఆయన ఏం మాట్లాడుతారో ఎవరికి తెలియదు.

ఈ రోజు భగవంతుడి దయవల్ల వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక..రాష్ట్రంలోని జలాశయాలన్ని కూడా నిండుకుండలా ఉన్నాయి. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. దాన్ని కూడా జీర్ణించుకోలేక పవన్‌ మాట్లాడుతున్నారు. జగన్‌ సీఎం అయ్యాక రాయలసీమలో అనేక ప్రాజెక్టులను డిజైన్‌ చేసి నీటిని నింపుతున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే కడుపు మంటతో జీర్ణించుకోలేకపోతున్నారు. గోదావరి జిల్లాలకు వెళ్లి రాయలసీమ ఫ్యాక్షన్‌ అంటాడు..సీమకు వెళ్లి సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ ప్రజలు నీకు కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. గోదావరి జిల్లాలో కూడా చిత్తుగా ఓడించారు. ప్రతి రోజు కులాలు, మతాల గురించి మాట్లాడేది పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే ఉన్నారు. ప్రతినిత్యం తన ప్రసంగాల్లో పవన్‌ మాట్లాడుతున్నారు. వైయస్‌ జగన్‌ క్రిస్టియన్‌ అయినా కూడా అన్ని మతాలను గౌరవిస్తున్నారు. ప్రజలంతా కలిసి మెలిసి జీవిస్తుంటే పవన్‌ నీచంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మా నాయకుడు చెప్పాడు. తన మతం మానవత్వమని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తన కులమని స్పష్టం చేశారు.

Read Also: కడప స్టీల్‌ ప్లాంట్‌కు వైయస్‌ఆర్‌ పేరు

ఆ రోజు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అర్చకుల జీతాలు పెంచితే.. ఈ రోజు వైయస్‌ జగన్‌ అర్చకులకు వేతనాలు ఇచ్చి తోడుగా ఉన్నారు. వైయస్‌ జగన్‌ ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంటే పవన్‌ ఏం మాట్లాడుతున్నారు. తాను ఇంగ్లీష్‌ మీడియం చదువుకున్నందుకు బాధపడుతున్నానని పవన్‌ అంటున్నాడు. మరీ తన కుమారుడిని ఓక్రిడ్జ్‌లో ఎందుకు చదివిస్తున్నారు. తెలుగు మీడియంలో చేర్పించవచ్చు కదా? పేదవాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించాలా?. ముందు నీ ఫ్యాన్స్‌ను సన్మార్గంలో పెట్టు. సోషల్‌ మీడియాలో మీ ఫ్యాన్స్‌ పెట్టే భాషాను ఒక్కసారి చూడు. ఇంట్లో తల్లి, భార్యను చూడకుండా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నోరు తెరిస్తా చాలు..తాట తీస్తా, తోలు తీస్తా అంటున్నాడు. నీవు ఎవరి తోలు తీయలేవు, తాట తీయలేదు. ఒక్కసారి నీ అభిమానులు పెట్టే పోస్టులు చూడండి. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతా అంటే సరిపోదు. సంస్కారహీనంగా మాట్లాడుతున్నది నీవు. ఒక ప్రాంతానికి వెళ్లి మరో ప్రాంతం గురించి మాట్లాడుతున్నావు. 2017లో జరిగిన ఓ సంఘటనలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో చోటు చేసుకున్నట్లు పవన్‌ నిన్న మాట్లాడారు.

రెండేళ్లు అంత పెద్ద సంఘటన దుమారం లేపితే..ఆ తల్లి పడుతున్న ఆవేదన నీ జనసైనికులు చెప్పలేదా? చంద్రబాబు పాలనలో నిద్రపోయావా? నేను ఈ సంఘటనపై జిల్లా మంత్రిగా రెండుసార్లు హోం మంత్రితో మాట్లాడాను. రెండు రోజుల క్రితమే బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడాను. దానిపై విచారణ కూడా చేయిస్తాం. ఇవన్నీ తెలియకపోతే పవన్‌ తెలుసుకో..నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. నీ సంస్కారం గురించి అందరికి తెలుసు. తెల్ల పంచా, చొక్కా వేసుకోకూడదా? ఏం మాట్లాడుతున్నావో తెలియదు. నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లు. కనీసం పేపర్‌ అయినా చూడటం నేర్చుకో..ఈ నెలలోనే కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయబోతున్నాం. యువతకు స్థానికంగా 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే కడుపు మండి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ప్యాకేజీ ఇవ్వడని బాధలో పవన్‌ ఉన్నారు. ఇష్టానుసారంగా తిడతే సహించేది లేదు. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి అవినీతి లేకుండా పాలన చేస్తుంది. ప్రశ్నిస్తా అంటున్నారు..ముందు ఆయన ఇంట్లో ఉన్నప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వైయస్‌ జగన్‌ కులం, మతం గురించి రెచ్చగొట్టే మాటలు మానుకో..లేదంటే వచ్చే సారి కనీసం డిపాజిట్లు కూడా రావు. కులం, మతం పేరెత్తకుండా రాజకీయాలు చేయడం నేర్చుకో పవన్‌..నెలకోసారి నిద్రలేచి వచ్చి తోలు తీస్తా, తాట తీస్తా అనడం మానుకోవాలి. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం. ఆయన చెప్పినట్లు పవన్‌ నడుచుకుంటున్నారు. 

 

Read Also: కడప స్టీల్‌ ప్లాంట్‌కు వైయస్‌ఆర్‌ పేరు

Back to Top