గౌతమన్న మృతిని నేటికీ జీర్ణించుకోలేకపోతున్నా..

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిచెంది నెలరోజులు అవుతున్నా.. గౌతమన్న లేడన్న మాటను నేటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక సైనికుడిలా గౌతమ్‌రెడ్డి పనిచేశారని గుర్తుచేశారు. గౌతమ్‌రెడ్డితో తనకు 12 ఏళ్ల నుంచి స్నేహం ఉందని, నెల్లూరు నుంచి ఇద్దరం మంత్రులుగా కలిసిమెలిసి పనిచేశామని, చిన్న బేధాభిప్రాయాలు లేకుండా ఉన్నామన్నారు. రాజ‌కీయాల్లో ఎప్పుడూ వివాదాల్లోకి వెళ్ల‌లేదు, అంద‌రితో క‌లిసిమెలిసి ప‌నిచేశారు. గౌతమన్న మరణం రాష్ట్ర ప్రజలతో పాటు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తీరనిలోటన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top