అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని..ఆయన కుమారుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేయబోతున్నారని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల చరిత్రలో సొంతంగా ఒక్క ప్రాజెక్టు అయినా శంకుస్థాపన చేసి..ప్రారంభించారా అని ప్రశ్నించారు.పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ఎత్తు ఒక మిల్లీ మీటర్ కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలవరం అంచనా వ్యయంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామని, ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం వైయస్ జగన్ లేఖ రాశామన్నారు. పీపీఏ అథారిటీలో కూడా సవరించిన అంచనాలపై రాష్ట్ర తరపున వాదనలు వినిపించామని వెల్లడించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నారంటే..
పోలవరం ప్రాజెక్టుపై చాలా మందికి అనేక రకాల అపోహాలు ఉన్నాయి. దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. పోలవరం గురించి వాళ్లు చేసిన దరిద్ర్యాన్ని ఈ ప్రభుత్వం ఎలా కడుక్కోవాల్సి వస్తోంది. ఈ ప్రాజెక్టును 1942లో అప్పటి చీప్ ఇంజనీర్ వెంకటకృష్ణ య్యార్ అనే వ్యక్తి 170 అడుగులకు రూపొందించారు. ఆ తరువాత 180 అడుగులకు, ఆ తరువాత 200 అడుగులకు మొత్తానికి 830 టీఎంసీల స్టోరేజీతో చేయాలని ఒక ప్రతిపాదన చేశారు. అప్పట్లో ఒక కంటెన్సికీ ఇచ్చారు. తరువాత 1956 తరువాత గొడవలు జరగడంతో పక్కన పెట్టారు. టంగుటూరు అంజయ్య అప్పట్లో పునాది వేశారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పోలవరం గురించి ఆలోచన చేయలేదు. తరువాత సుదీర్ఘ పాదయాత్రలో 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 70 ఏళ్ల తరుఆత 8.11.2004లో పోలవరానికి ఫౌండేషన్ వేశారు. 2005లో పనులు ప్రారంభించారు. దానికి సంబంధించిన అన్ని అనుమతులు తీసుకువచ్చారు. వైయస్ఆర్ చనిపోయిన తరువాత 2009-2014 వరకు చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు.
మా సీఎం వైయస్ జగన్ మొట్ట మొదటిసారిగా 2011 ఫిబ్రవరిలో పాదయాత్ర చేశారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం గురించి అప్పటి రాజ్యసభలో ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ..పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ప్రకటించారు. 90 శాతం, 10 శాతం ఉంటుందని, 90 శాతం కేంద్రమే భరించాలని ఓ చట్టం చేశారు. 10 శాతం కూడా గతంలో ఖర్చు చేసిన డబ్బుల్లోకి జమ చేసుకోవాలని సూచించారు. పీపీఏ అనే అథారిటీ ఒకటి ఏర్పాటు చేశారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం గురించి పట్టించుకోలేదు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి సత్యదూర మాటలు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2016 వరకు ఐదు పీపీఏ మీటింగ్‌లు జరిగాయి. ప్రతి మీటింగ్‌లో రివైజ్ అంచనాలు ఇవ్వండంటే..నెల రెండు నెలలు అంటూ కాలయాపన చేశారు. 5వ పీపీఏ మీటింగ్ 2016 ఏప్రిల్ 20న జరిగింది. ఆ రోజు చంద్రబాబు పుట్టిన రోజు కూడా. ఈ సమావేశంలో రివైజ్డ్ సర్టిఫైడ్ చేయమంటే మళ్లీ టైం కావాలన్నారు. సెప్టెంబర్ 8, 2016న కేంద్రం స్పెషల్ ప్యాకేజీని ప్రకటిస్తే..చంద్రబాబు అప్పట్లో దాన్ని ఘనంగా స్వాగతించారు. నీతి అయోగ్ రాష్ట్రాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోమంది అంటూ వంద శాతం కాంపోనెంట్ ఇచ్చేందుకు ఒప్పుకుందని ఆ రోజు సంబరాలు చేసుకున్నారు. పాత యాక్ట్ ప్రకారం 90 శాతం కేంద్రం భరించాల్సి ఉంది.
గతంలో ఖర్చు పెట్టింది లెక్కలు వేయడం లేదు. కొత్తగా చంద్రబాబు సాధించింది ఏమీ లేదు. దానికి సంబంధించి పవర్ కూడా తీసేశారు. భూసేకరణలో తేడాలు ఉన్నా కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. ఆ తరువాత 15వ ఆర్థిక సంఘం ఏర్పడింది. 2014 తరువాత ఏ రకమైన నిధులు కేంద్రం ఇవ్వదని చెబితే చంద్రబాబు అసెంబ్లీలో సన్మానాలు చేయించుకున్నారు. కేంద్రంలో అప్పట్లో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. వీరు ఏమాత్రం పోలవరంపై నోరు మెదపలేదు. ఎంతసేపు ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఆలోచన చేశారే తప్ప..అక్కడ ఉన్న ప్రజల గురించి ఆలోచన చేయలేదు. మూడేళ్ల పాటు భూ సేకరణ గురించి ఆలోచన చేయలేదు. అప్పట్లో ప్రతిపక్షం ఉన్న వైయస్ జగన్ రూ.14 వేల కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వమని కేంద్రం చెబుతోంది. రూ.2500 కోట్ల పవర్ ప్రాజెక్టు కు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పారని గుర్తు చేస్తే మైక్ కట్ చేశారు. గంటల తరబడి పోడియం వద్ద నిలబడినా మైక్ ఇవ్వలేదు. ఆరోజు మా నేత వైయస్ జగన్ ప్రశ్నించారు. ఆ రోజు చంద్రబాబు పట్టించుకోలేదు.
మా ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబు పోలవరాన్ని 70 శాతం పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు. రూ.50 వేల కోట్లలో ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు ఖర్చు అయ్యింది. ఈ డబ్బులతో 70 శాతం పూర్తి అవుతుందా? ఈ రాష్ట్ర ప్రజలకు..ఈ సభకు వివరాలు తెలియాల్సి ఉంది. హెడ్ వర్కర్స్‌కు సంబంధించి రూ.6 వేల కోట్లు చంద్రబాబు ఖర్చు చేశారు. అంటే వర్క్ స్పాట్‌లో 40 శాతం పనులు చేశారు. భూముల సేకరణకు సంబంధించి 75 వేల ఎకరాలు వైయస్ రాజశేఖరరెడ్డి ఆ రోజు రేటుకు సేకరించారు. 14 ఏళ్ల చంద్రబాబు చరిత్రలో ఒక్క ప్రాజెక్టు అయినా శంకుస్థాపన చేసి పూర్తి చేశారా? పట్టిసీమ గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు. ఇందులో రైట్ కెనాల్‌ను వైయస్ఆర్ పూర్తి చేశారు. కేవలం 10 వేల ఎకరాలకు నీరిచ్చారు. దాంట్లో కూడా 80 శాతం వైయస్ఆర్ కంట్రీబ్యూషన్ ఉంది. కాదు అని చెప్పే దమ్ముందా టీడీపీ నేతలకు?..రూ.57 వేల కోట్లు తీసుకుంటే..10 శాతం రాష్ట్రం భరిస్తే..చంద్రబాబు పూర్తి చేసింది 18 శాతం మాత్రమే. రూ.55 వేల కోట్లు అంటే 20 శాతం అవుతుంది. ఇది వదిలేసి..70 శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. వీళ్ల జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. వైయస్ఆర్ కేవలం ఐదేళ్లలో అనేక ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి పూర్తి చేశారు. సీఎం స్థాయిలో ఉన్నచంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తే..అందులోనైనా నిజాలు చెప్పాలనే ఆలోచేన ఆయనకు లేదు. రూ.7800 కోట్లతో 50 శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని కేంద్రానికి లేఖ రాస్తే..వాళ్లు ఏమనుకోవాలో చెప్పాలి. మరో లేఖలో రూ.16వేల కోట్ల లెక్కలు సబ్‌మిట్ చేశామని..మిగిలిన డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.
మేం ఏంచేశామంటే..పోలవరంపై రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లి రూ.800 కోట్లు ఆదా చేశాం. కోవిడ్ సమయంలో కూడా ప్రాజెక్టు పనులు పరుగులు తీయిస్తున్నాం. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం. టీడీపీ నేతలు తొందరపడొద్దు. ఇటీవల పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని తప్పుడు ప్రచారానికి తెర లేపారు. ఈనాడు టీడీపీ గజెట్లోనే 2018 జూన్ నాటికి పోలవరం డ్యాం 41 అడుగుల ఎత్తులో నిర్మాణం పూర్తి చేసి కుడి, ఎడమ కాల్వలకు నీరిస్తామని రాయించుకున్నారు. స్పిల్ వే, రాక్‌ఫీల్ డ్యామ్ వేరువేరుగా ఉంటాయి. స్పిల్‌వే పూర్తి చేసి వచ్చిన వరదను మళ్లించి ర్యాక్‌పిల్ పూర్తి చేయాలి.వీళ్లు కాఫర్ డ్యామ్ సగం కట్టి మభ్యపెట్టారు. ఈ రోజు మా సీఎం సమీక్ష నిర్వహించి స్పీల్‌వే పూర్తి చేసి, 18 వేల గిరిజన, ఎస్సీ, బీసీ కుటుంబాలు మునిగిపోతారని, వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని వైయస్ జగన్ ఆలోచన చేశారు. పునరావాసం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మేం డ్యాం కట్టే లోపే 17వేల కుటుంబాలకు పునావాసం కల్పిస్తాం. మోదీ కూడా టీడీపీ గురించి పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని చెప్పారు. దిక్కుమాలిన పేపర్లలో రాయించుకోవడం..దానిపై చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టడం పరిపాటిగా మారింది. ఆంద్రజ్యోతి పేపర్ చిత్తు పేపర్‌కు కూడా పనికి రాదు. మేం చెన్నైలో ఉన్నప్పుడు అప్పట్లో ఓ పేపర్‌తో బజ్జికి ఉన్న అయిల్ తీసేందుకు పనికి వచ్చేది. ఈ పేపర్ అందుకు కూడా పనికి రాదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు మా సీఎం వైయస్ జగన్ ముందుకు వచ్చారు. 75 వేల మంది గిరిజనుల గురించి పట్టించుకోని టీడీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం సిగ్గు చేటు. పేదల గురించి పట్టించుకోకూడదన్నదే టీడీపీ నేతల దోరణి. దళితులు, బలహీన వర్గాలు రాజధాని ప్రాంతంలో ఉండకూడదన్నది వారి ఆలోచన.
ఆ భగవంతుడు కూడా ఎవరు పూర్తి చేయాలని సంకల్పించారో..వారే పోలవరాన్ని పూర్తి చేస్తారు. మహానేత పోలవరాన్ని ప్రారంభిస్తే..ఆయన తనయుడు వైయస్ జగన్ పూర్తి చేస్తారు. ఎవరు..ఎంత గిలగిల కొట్టుకున్నా ఎవరూ ఆపలేరు. ఆ భగవంతుడు మా సీఎంకు పోలవరం పూర్తి చేసే అవకాశాన్ని ఇచ్చారు.పోలవరాన్ని ప్రారంభించే సమయంలో టీడీపీ నేతలను కూడా ఆహ్వానిస్తాం. అప్పుడు వాళ్లు టేపులు తెచ్చుకొని కొలుచుకోవచ్చు. ఒక్క అంగుళం కూడా తగ్గించే ప్రసక్తే లేదు. మా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అధికారులు కేంద్రంతో ఒప్పించి నిధులు రప్పించేందుకు కృషి చేశారు. మా సీఎం వైయస్ జగన్ లేఖ రాయడంతో నిధులు వస్తున్నాయి. డ్యాంతో పాటు ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ రూ.29 వేల కోట్లు కూడా వస్తాయి. మా సీఎం సారధ్యంలో మంత్రులు, అధికారులు పోలవరం గురించి కేంద్రాన్ని ఒప్పించగలిగాం. విష ప్రచారం చేయడంలో వాళ్లు సిద్ధహస్తులు. డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేసి..కుడి, ఎడమ కాల్వలకు నీళ్లు ఇస్తాం. మేమంతా కూడా గర్వపడుతున్నాం. మా ముఖ్యమంత్రి సారధ్యంలో పూర్తి చేసి పాల్గొనబోతున్నామని చెప్పుకుంటున్నాం. శంకుస్థాపన కార్యక్రమం, ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంటాయి. కానీ చంద్రబబు హయాంలో స్పిల్‌వేకు, గేట్‌కు ఇలా 8 శంకుస్థాపనలు చేశారు. వారం వారం పోలవరం అంటూ కలెక్షన్ల కోసం తిరిగారు. శనివారం కూలీలకు డబ్బులు ఇస్తారు..సోమవారం చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారు. డిసెంబర్ 2021 నాటికి పోలవరాన్ని తప్పకుండా పూర్తి చేస్తాం. తప్పిదాలను సరిచేస్తూ ముందుకు వెళ్తాం.
వైయస్ జగన్ వచ్చిన తరువాత రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు కురిశాయి. రాజు మంచివారు అయితే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. భూగర్భ జలాలు పెరిగాయి. అన్ని ప్రాజెక్టులు
కూడా వైయస్ జగన్ పూర్తి చేస్తారు. పులిచింతల, నెల్లూరు సోమశీల ప్రాజెక్టు, కండలేరు, గండికోట ప్రాజెక్టు, చిత్రావతి ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. అనంతపురంలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు 7 వేల ట్యాంకులు నిండాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇంకా సముద్రంలోకి నీరు వెళ్తోంది. పెన్నా నుంచి కూడా సముద్రంలోకి నీరు వెళ్తుంది. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కరువు సీమకు అందించాలని చర్యలు తీసుకున్నారు. 44 వేల క్యూసెక్కుల నుంచి 84 వేల క్యూసెక్కులు వరద సమయంలో నీరు తీసుకునేలా విస్తరణ పనులు చేపడుతున్నాం. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పనులు ప్రారంభిస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు బ్యారేజీలు కట్టాలని ప్రతిపాదనలు రూపొందించాం. ప్తరి ఒక్క ప్రాంతం సస్యశ్యామలం చేయాలని వైయస్ జగన్ ఆలోచన చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టును 16 నెలల్లో 2 కిలోమీటర్ల 80 అడుగులు మా ప్రభుత్వం తవ్వింది. ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ రూ.1400 కోట్లు విడుదల చేశారు.
ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్రాజెక్టు వైయస్ఆర్ శంకుస్థాపన చేస్తే..వైయస్ జగన్ పూర్తి చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా పోలవరం డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేస్తాం. 2022 నాటికి సాగునీరు ఇస్తామని హామీ ఇస్తున్నాం. సీఎం వైయస్ జగన్ ఆశీస్సులతో ఇరిగేషన్ శాఖలో బెటర్ సబ్జెక్ట్ నేర్చుకున్నాను. చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇచ్చి పోలవరంలో భాగం స్వామ్యం చేయడం సంతోషంగా ఉంది. దేవుడు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా..ఈ రోజు దైవ సమానుడైన వైయస్ జగన్ ఆశీస్సులు ఉన్నాయని గర్వంగా చెబుతున్నానని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. పోలవరం పర్యటనలకు చంద్రబాబు హయాంలో రూ.100 కోట్లు ఖర్చు చేశారు.మేం 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇదే మా చిత్తశుద్ధికి నిదర్శమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.