నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అనిల్ శ్రీకారం చుట్టారు. రూ.4 కోట్లతో బీవీఎస్ బాలికల పాఠశాలలో నూతన భవనాలకు మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ శంకుస్థాపన చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో వరుణ దేవుడు రాష్ట్రంపై కరుణ చూపారని చెప్పారు. అన్ని ప్రాంతాలకు నీరందిస్తామని తెలిపారు.