పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం

 పోలవరంపై మంత్రి అంబటి రాంబాబు మ్యాప్‌ ప్రజెంటేషన్‌

పోలవరంపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది

కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారు

కాసులకు కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిదం చేశారు.

పోలవరం పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకత పాటించాం

ఆర్‌ అండ్‌ ఆర్‌ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు

ముంపు ప్రజలకు ప్యాకేజీ అందించి ఖాళీ చేయిస్తున్నాం

2018లో పూర్తి చేస్తాం..రాసుకోమన్నారు..చేశారా?

ఈనాడు విష ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి

చంద్రబాబు చేసిన తప్పులను ప్రజలు భరిస్తున్నారు

విజయవాడ: పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ ఎలా కట్టారని ప్రశ్నించారు. డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారని తెలిపారు. కాసులకు కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిందం చేశారని మండిపడ్డారు. నాటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మాపై విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జాతికి ద్రోహం చేసినవాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన తప్పులను ప్రజలు భరిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చరిత్రహీనంగా ప్రవర్తించింది. 2018లో పోలవరం పూర్తి చేస్తాం రాసుకోండి అన్నారు. పూర్తి చేశారా అని నిలదీశారు. ఈనాడు విష ప్రచారాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. పోలవరం పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరంపై మంత్రి అంబటి రాంబాబు సోమవారం మ్యాప్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే..

పోలవరాన్ని పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.  కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ ఎలా కట్టారు?నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టర్లను తీసుకొచ్చిన ఘనుడు చంద్రబాబు. ట్రాన్స్‌ట్రాయ్‌ను తీసేసి నవయుగ తెచ్చింది చంద్రబాబు కాదా?పోలవరం ఆలస్యానికి చంద్రబాబు నిర్ణయాలే కారణం. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని పూర్తి చేయకపోవడం కారణంగా పనుల్లో ఆలస్యం జరిగింది. ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీని కంప్లిట్‌ చేసి పనులు ప్రారంభించి ఉంటే ఈపాటి డయాఫ్రమ్‌ వాల్, ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణంపూర్తి అయ్యేది. ఫస్ట్‌ స్టేజ్‌ కంప్లీట్‌ కాకుండా అడ్డం పడుతున్నారు. చంద్రబాబు అహంకారం, అతి తెలివి తేటలు.
రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకత పాటించాం. కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపేందుకు కుట్ర చేస్తున్నారు. పనుల్లో నాణ్యత పెంచేందుకు మా ప్రభుత్వం పని చేస్తోంది. 
టీడీపీ చేసిన తప్పిదానికి మేం బాధ్యత వహించాలా?. కాసుల కోసం కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిందం చేశారు. నాటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మాపై విష ప్రచారం చేస్తున్నారు. 

2018కి పోలవరాన్ని పూర్తి చేస్తాం..రాసుకోండి అన్నారు కదా?. ఆర్‌అండ్‌ఆర్‌ కంప్లీట్‌ కాకుండా ఎలా పూర్తి చేస్తారు?. టీడీపీ హయాంలో దుర్భుద్ధితో వ్యవహరించడంతోనే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలను సెట్‌రైట్‌ చేస్తున్నాం.  మా ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.1500 కోట్లు ఖర్చు చేసింది. మాట్లాడితే చాలు రాంబాబుకు ఏమి తెలియదు అంటున్నారు. తెలియదు కాబట్టే అందరిని కూర్చోబెట్టుకొని తెలుసుకుంటున్నాను. చేస్తాం..వాస్తవాలను గమనిస్తాం. జాతికి ద్రోహం చేసినవాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఈనాడులో పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో కథనాలు రాయడం కాదు. వాస్తవాలు తెలుసుకోండి. ఈ విధ్వాంసాలకు కారణం చంద్రబాబు.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు పిచ్చి పిచ్చి రాతలు రాసి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి మీద బురద జల్లాలని మీరు ప్రయత్నం చేసినా ఏమీ జరగదు. మేం చిత్తశుద్ధితో, ధర్మంగా పని చేస్తున్నాం. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న పోలవరాన్ని నిర్మించేందుకు తహతహలాడుతున్నాం. మాలో తపన ఉంది. అంతేతప్ప మీలా క్యాష్‌ కొట్టేయాలని, కమీషన్లు నొక్కేయాలనే ఆలోచన మాకు లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. 

వైయస్‌ జగన్‌ మొట్ట మొదటే చెప్పారు. మనం పోరాటం చేస్తున్నది చంద్రబాబు ఒక్కడితో కాదు..దుష్ట చతుష్టయంతో పోరాడుతున్నాం అని గుర్తు చేశారు. 
పోలవరం విషయంలో తప్పులన్నీ వైయస్‌ జగన్‌వి,  ఒప్పులన్ని చంద్రబాబు అన్నట్లుగా రాశారు. తప్పులన్నీ చేసింది చంద్రబాబు, అనుభవిస్తున్నది రాష్ట్ర ప్రజలు.సెక్రటరీలు, మంత్రులను మార్చితే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా? ఇలాంటి కథనాలు రాసే వారికి బుద్ధిజ్ఞానం ఉండాలి. 

లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ ఎందుకు పూర్తి చేయడం లేదని చంద్రబాబుఅంటున్నారు. అక్కడ మైనస్‌ 22 మీటర్ల గుంత పడింది. ఈ గుంటను పూడ్చాలంటే మరో చిన్న డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలి. డయాఫ్రమ్‌ వాల్‌ కట్టి కాఫర్‌డ్యామ్‌ కట్టని చంద్రబాబు తెలివి తక్కువ పని వల్లే పోలవరం ఇంత ఆలస్యమైంది. దీన్ని ఏదోవిధంగా మాపై నెట్టాలని రామోజీరావు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లను నమ్మకండి. అందరూ తోడుదొంగలే. వీటిపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసే తప్పుడు కథనాలకు ఎప్పటికప్పుడు చెబుతూనే ప్రజలను చైతన్యవంతం చేస్తాం. డయాఫ్రమ్‌ వాల్‌ విషయంలో చంద్రబాబు ద్రోహం చేశారని ప్రజలు అంగీకరించే  వరకు, వారికి అర్థమయ్యేలా మేం చెబుతూనే ఉంటామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 
 

Back to Top