నెల ముందే నీటి విడుదల

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి రాంబాబు
 

గుంటూరు: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాలువలకు మంత్రి అంబటి రాంబాబు నీటిని విడుదల చేశారు. వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వైయస్‌ జగన్‌ ఆదేశాలతో ముందే నీటిని విడుదల చేశామని మంత్రి తెలిపారు. త్వరగా ఖరీఫ్‌ ప్రారంభం కావడం  వల్ల 3 పంటలు పండే అవకాశం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి రైతుకు ఇబ్బంది ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. పులిచింతలలో 34 టీఎంసీల నీరు నిల్వ చేసి రైతులకు అందిస్తున్నామని చెప్పారు. పట్టిసీమ నుంచి నీరు తెచ్చే అవసరం లేదన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత నీటి కొరత అనేది లేదన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top