విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకే ఎన్నికలు 

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు నిర్వహించామని, విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకే ఎన్నికలు చేపట్టినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.
రికార్డు స్థాయిలో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. 46,612 స్కూళ్లలో విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించామని, వివాదాలు లేకుండా ఒకే రోజు 96 శాతం పాఠశాలల ఎన్నికలు పూర్తి అయినట్లు వెల్లడించారు.44,921 పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీలు పూర్తి చేశామని మంత్రి వివరించారు. 63 శాతం పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయన్నారు.

Back to Top