సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన చిరంజీవి

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న మెగాస్టార్‌ చిరంజీవి, భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం వైయస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని మెగాస్టార్‌ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. 
 

Back to Top