వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన పార్టీ నేత‌లు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్‌.జగన్‌మోహ‌న్‌రెడ్డిని తాడేప‌ల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప‌లువురు పార్టీ  ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు క‌లిశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఉన్నారు. ఉదయం నుండి క్యాంప్ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అందరినీ కలిసిన వైయ‌స్‌ జగన్‌.. వారికి ధైర్యం చెప్పారు.
 
 

 

 

Back to Top