టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి పలువురి చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉర‌వ‌కొండ ఇన్‌చార్జ్ వై.విశ్వేశ్వరరెడ్డి
 

అనంత‌పురం: ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పలువురు వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఉరవకొండ మండలంలోని నెరిమెట్ల గ్రామానికి చెందిన కురుబ రామకృష్ణ, కురుబ చిన్న పర్వతరెడ్డి, కౌడికి ఆనంద్, చేజాల యువరాజు, కురుబ వన్నప్ప, కౌడికి భీమలింగా, కురుబ రమేష్, కురుబ హోన్నూరు స్వామి, కురుబ ఉలితప్ప, మారుగొండ పర్వత రెడ్డి తదితరులు గురువారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతపురం నగరంలోని నియోజకవర్గ ఇంఛార్జి వై. విశ్వేశ్వరరెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ పాలన, అభివృద్ధి నచ్చి తాము వైయ‌స్ఆర్‌సీపీలో చేరినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెరిమెట్ల సర్పంచ్ యోగేంద్ర రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కురుబ అయ్యప్ప, కురుబ హనుమంతు, చేజాల హోన్నూరు స్వామి, కురుబ పర్వతప్ప, మరే గౌడ్.. తదితరులు పాల్గొన్నారు.

Back to Top