రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చంద్రబాబు కుట్ర

శాస‌న‌స‌భ‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలని ప్రతిపక్షనేత  చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడని శాస‌న‌స‌భ‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని, అందుకే కుయుక్తులు పన్నుతున్నాడన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమత్యూలత వస్తుందని మాట్లాడిన మూర్ఖుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉందని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా భావిస్తున్న తరుణంలో  కుటిల యాత్రకు చంద్రబాబు తెరతీశాడని మండిపడ్డారు. 

తాజా వీడియోలు

Back to Top