కేంద్రాన్ని ప్రశ్నించే ద‌మ్ముందా బాబూ? 

 మంత్రి కొట్టు సత్యనారాయణ 
 

క‌ర్నూలు:  పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి గానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నార‌ని మంత్రి కొట్టు సత్యనారాయణ  విమ‌ర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించే ద‌మ్ము చంద్ర‌బాబుకు ఉందా అని ప్ర‌శ్నించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాద‌న్నారు. అన‌స‌ర రాజ‌కీయం చేస్తూ ప్రజ‌ల మెప్పుకోసం ప్ర‌జ‌ల్లోకి రావాని చూస్తున్నార‌ని అన్నారు. పెరిగిన ధ‌ర‌ల‌పై చంద్రబాబు అన‌స‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 

Back to Top