సూపర్‌-6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి

మాజీ మంత్రి కొడాలి నాని

 తాడేపల్లి: ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్‌-6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల‌ని మాజీ మంత్రి కొడాలి నాని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని  కొడాలి నాని విమ‌ర్శించారు. అలాగే, విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

 కొడాలి నాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఇస్తామన్న మూడు వేలు ఇవ్వాలి. సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఫర్నీచర్‌పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకండి.

చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. రుషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి.. వైఎస్‌ జగన్‌వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్దాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్‌ చెప్పేవన్నీ అబద్దాలే. టీడీపీ దాడులకు భయపడేది లేదంటూ వ్యాఖ్యలు చేశారు.  

Back to Top