టీడీపీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ అన్షార్‌ అహ్మద్‌

అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ(మాజీ ఎంపీపీ) పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. స‌త్య‌సాయి జిల్లా నుంచి టీడీపీ, జ‌న‌సేన కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ సీపీ గూటికి చేరుకుంటున్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో టీడీపీ నుంచి వైయస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతలు చేరారు.

సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద సీఎం వైయస్‌.జగన్‌ సమక్షంలో హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ అన్షార్‌ అహ్మద్  వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమక్షంలో పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ(మాజీ ఎంపీపీ), పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

Back to Top