స‌మ‌రోత్సాహం

పోటెత్తిన మున్సిప‌ల్ స్టేడియం 

పార్టీ శ్రేణులకు వైయ‌స్ జ‌గ‌న్‌ దిశానిర్దేశం

కడప:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేప‌ట్టిన‌ సమరశంఖారావానికి విశేష స్పంద‌న ల‌భించింది. స్థానిక‌ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 13 జిల్లాల్లో కేడర్‌ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. నిన్న చిత్తూరు జిల్లాలో నిర్వ‌హించిన మొద‌టి స‌భ‌కు అపూర్వ స్పంద‌న వ‌చ్చింది. రెండో రోజు కడపలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి జిల్లాకు చెందిన బూత్ క‌మిటీ స‌భ్యులు, పార్టీ నాయ‌కులు అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు.

జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2,500 మంది చొప్పున 25 వేల మందికి ఏర్పాట్లు చేశారు. సభా వేదికతోపాటు, ప్రాంగణాన్నంతా వైయ‌స్ఆర్‌సీపీ జెండాలోని ఆకుపచ్చ, తెలుపు, నీలివర్ణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.  

Back to Top