స‌ర్‌..మీ స్పూర్తితో పేదలకు న్యాయం చేస్తా

జూనియ‌ర్ న్యాయ‌వాది రత్న కుమారి, గుంటూరు 

తాడేప‌ల్లి: జ‌గ‌న్ స‌ర్‌..నేను లా పూర్తి చేయడానికి మీరు చాలా సాయం చేశారు, మీకు రుణపడి ఉంటాను, ఇలాంటి మంచి పాలన ఉంటుందనుకోలేదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను, మీ స్పూర్తితో నేను పేదలకు న్యాయం విషయంలో సహాయం చేస్తానని మీకు మాట ఇస్తున్నాన‌ని గుంటూరుకు చెందిన జూనియ‌ర్ న్యాయ‌వాది ర‌త్న‌కుమారి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ. 5,000 స్టైఫండ్ చొప్పున ఫిబ్రవరి, 2023 - జూన్, 2023 (5 నెలలు) కు ఒక్కొక్కరికి రూ. 25,000 ఇస్తూ, మొత్తం రూ. 6,12,65,000 ను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ జ‌మ చేశారు. ఈ సందర్భంగా సీఎంతో వర్చువల్ కాన్ఫరెన్స్ లో జూనియ‌ర్ న్యాయవాదులు మాట్లాడారు..వారు ఏమన్నారంటే, వారి మాటల్లోనే

సార్, నమస్కారం, నేను గుంటూరు బార్ ఆసోసియేషన్ లో జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను, చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయాను, మా బాబాయి కూలీ పనులు చేస్తూ తన పిల్లలతో పాటు చదివించారు, నేను లా చదువుతాననగానే ఒప్పుకుని లా చదివించారు, చదువు పూర్తవగానే గుంటూరు వచ్చి ఇక్కడ ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు, స్పందనలో అప్లికేషన్ పెట్టగానే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అకామిడేషన్ ఇప్పించారు, మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి వస్తుంది, విద్యా కానుక వస్తుంది, మా తమ్ముడికి విద్యా దీవెన వస్తుంది, పిన్నికి చేయూత వస్తుంది, నేనే కాదు కుటుంబ సభ్యులు అందరూ మీ పథకాలు పొందుతున్నారు, నేను లా పూర్తి చేయడానికి మీరు చాలా సాయం చేశారు, మీకు రుణపడి ఉంటాను, ఇలాంటి మంచి పాలన ఉంటుందనుకోలేదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను, మీ స్పూర్తితో నేను పేదలకు న్యాయం విషయంలో సహాయం చేస్తానని మీకు మాట ఇస్తున్నాను, థ్యాంక్యూ సార్. 

అరవింద్, అడ్వకేట్, విజయవాడ
సార్, నేను 2020 నుంచి జూనియర్ అడ్వకేట్ గా బెజవాడ బార్ అసోసియేషన్ లో ప్రాక్టీస్ ప్రారంభించాను, చిన్నప్పటి నుంచి ఈ వృత్తి అంటే ప్రేమ, ఇష్టం, దీనికి మా కుటుంబ సభ్యులు కాస్త ఆందోళన చెందారు, కానీ నేను లా ప్రాక్టీస్ ప్రారంభించేసరికి మీరు అధికారంలోకి రావడం, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వకేట్స్ లబ్ధిపొందుతున్నారు. నేను ఈ పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి శాంక్షన్ చేశారు, మా కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, మీరు ఇస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది, నాలాగా లబ్ధిపొందుతున్న వారందరి తరపునా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్, మా అడ్వకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది, ధ్యాంక్యూ సార్.

Back to Top