జగన్‌ ప్రజలకు మంచిచేయాలనే పట్టుదలతో ఉన్నారు

జగన్‌పై ఒక ఆరోపణ కూడా రుజువు కాలేదు 

హైదరాబాద్‌:వైయస్‌ జగన్‌పై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని సినీనటి,వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు జీవిత రాజశేఖర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్‌ జగన్‌పై వచ్చిన ఆరోపణలు..ఆరోపణలుగానే మిగిలిపోయాయన్నారు.ఒక్క ఆరోపణలను కూడా రుజువు చేయలేకపోయారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజల కోసం ఎంతో  కష్టపడుతున్నారని ప్రజలకు మంచి చేయాలన్న పట్టుదలతో వైయస్‌ జగన్‌ ఉన్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌కు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.

Back to Top