అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు.. సీఎం వైయస్ జగన్ ప్రతినిధులుగా గురువారం కూడా ఇంటింటికీ వెళ్లారు.

ప్రస్తుత ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధితో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేస్తూ వివరించారు. ఈ నాలుగు సంవత్సరాల్లో తమకు ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలతో పంచుకున్నారు. కులం, మతం, వర్గం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుండటం ఒక్క సీఎం వైయస్ జగన్‌కే సాధ్యమైందని ఊరూరా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలు స్పష్టీకరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మా నమ్మకం నువ్వే జగనన్న - జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం దెందులూరు మండలం గాలాయగుడెం పంచాయితీ నాగులదేవునిపాడు గ్రామంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు దెందులూరు మండల జెడ్.పి.టి.సి నిట్టా లీలానవకాంతంగంగరాజు పాల్గొన్నారు.
