దసరా మహోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం ఆలయాల ధర్మకర్తల మండలి ప్రతినిధులు మంగళవారం కలిశారు. త్వరలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎంని ఆహ్వానించారు.

ఈ నెల 15 నుంచి 23 వరకు దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు, ఈ నెల 15 నుంచి 24 వరకు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు జరగనున్నాయి. సీఎం వైయ‌స్ జగన్‌కి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలను అందించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు.

కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవన్, దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఈవో పెద్దిరాజు, ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పాల్గొన్నారు.

Back to Top