గుడివాడలో `హౌస్ ఫ‌ర్ ఆల్` ప్రారంభం

కృష్ణా: ఇళ్ల ప‌థ‌కంలో రివ‌ర్స్‌టెండ‌రింగ్ ద్వారా రూ.200 కోట్లు ఆదా చేశామ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో పేదలకు నిర్మిస్తున్న `హౌస్‌ ఫర్‌ ఆల్‌` పథకం పనులను మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వం పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడిందన్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌తీ ప‌థ‌కం పార‌ద‌ర్శ‌కంగా అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు. ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల పేదలకు సకాలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామన్నారు. న్యాయస్థానం అనుమతులిస్తే స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున (ఆగస్టు 15) పేదలకు 30 ల‌క్ష‌ల ఇళ్ల పట్టాలు అందించడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top