నందిగం పాడులో  "గడపకు గడపకు మన ప్రభుత్వం"

హోం మంత్రి తానేటి వ‌నిత‌కు ఘ‌న స్వాగ‌తం
 

ఏలూరు:  హోం మంత్రి తానేటి వ‌నిత నందిగంపాడు గ్రామంలో మంగ‌ళ‌వారం  "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం నిర్వ‌హించారు.  ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  మూడేళ్ల పాల‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి చేసిన మేలును వ‌నిత గడప గడపలో వివరించారు. ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని వెంట వచ్చిన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top