సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్లు

తాడేప‌ల్లి: గుంటూరు, కృష్ణా జిల్లాల‌ ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్లుగా నూతనంగా ఎన్నికైన క‌త్తెర హెనీ క్రిస్టినా, ఉప్పాల హారిక ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ను గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా దంపతులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తనకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశమిచ్చినందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు కత్తెర హెనీ క్రిస్టినా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అదే విధంగా కృష్ణా జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ఉప్పాల హారిక సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి.. కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పాల హారిక వెంట కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఉన్నారు. 

Back to Top