సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన మాస్టర్‌ గంధం భువన్‌ జై

అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాస్టర్‌ గంధం భువన్‌ జై తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. గంధం భువన్‌ జై ఇటీవల యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ మౌంట్‌ను ప్రపంచంలోనే అతి పిన్న వయసులో(8 సంవత్సరాల 3 నెలలు) అధిరోహించిన బాలుడిగా రికార్డు సృష్టించాడు.

భువన్‌ జై ప్రతిభను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తనయుడు మాస్టర్‌ గంధం భువన్‌ జై. భువన్‌ జైతో అతని తండ్రి గంధం చంద్రుడు, కోచ్‌ శంకరయ్య, రెవెన్యూ, పర్యాటక, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉన్నారు. 

Back to Top