గాదె వెంకట్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

తాడేపల్లి: మాజీ మంత్రి, టీడీపీ నేత గాదె వెంకట్‌రెడ్డి, ఆయన తనయుడు మధుసుదన్‌రెడ్డిలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో గాదె వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన గాదె వెంకట్‌రెడ్డి గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్‌ మంత్రిగా ఉన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ మంత్రిగా పనిచేశారు. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. అయితే చంద్రబాబు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top