అనంతపురం: ఆంధ్ర రాష్ట్రమంతా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమం శింగనమల నియోజకవర్గంలో దిగ్విజయంగా ప్రారంభమైంది. ’’ఇదీ జగనన్న పరిపాలన’’ అంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. సమస్యలపై ఆరా తీస్తూ..ఆప్యాయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో ఉదయమే నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులను తీసుకున్న ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడ నుంచి గ్రామంలో ప్రతి వీధిలోని గడపగడపకు వెళ్లి మహిళలతో మాట్లాడి, జగనన్న అందించే సంక్షేమ పథకాలు ప్రతీది కూడా పేరుపేరునా అడిగి, అందుతున్నాయా? లేవా? అని తెలుసుకుంటున్నారు. అలాగే సంక్షేమ పథకాల వల్ల ఆ కుటుంబానికి ఎంతటి మేలు కలిగిందో అడుగుతున్నారు. నెలనెలా క్రమం తప్పకుండా అందించే పెన్షను పథకం దగ్గర నుంచి పిల్లలు చదువుకునే నాడు-నేడు బడులు, ఇంకా కాలేజీల్లో చదువుకునే పిల్లలు ఉంటే, జగనన్న విద్యా సంక్షేమ పథకాలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక ఇవే కాదు, మహిళా సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకుంటున్నారు. రైతులు కనిపిస్తే వైయస్సార్ రైతు భరోసా కేంద్రాల పని తీరుపై ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇంకా వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గ్రామంలో ప్రతి వీధి తిరిగారు. ప్రతీ ఇంటి తలుపు తట్టారు. అందరినీ పేరుపేరునా నవ్వుతూ పలకరిస్తూ, బాగున్నావా అమ్మా, బాగున్నావా అన్నా, బాగున్నావా అయ్యా...అంటూ ఒక ఆత్మీయురాలిలా పలకరిస్తూ ముందుకు సాగారు. ఇలా తొలిరోజు ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ప్రజలందరూ తమకు అందే జగనన్న సంక్షేమ పథకాల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యేగారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ , కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కన్వీనర్లు, వైయస్సార్ సీపీ ముఖ్యనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పాల్గొన్నారు